పల్నాడు జిల్లా: ప్రత్యేక సారాంశ సవరణ-2024లో భాగంగా జాగ్రత్తగా క్లెయిమ్స్ పరిశీలన చేసి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎల్.శివ శంకర్ సంబంధిత అధికారులను ఆదే శించారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్పందన హాలులో ఈఆర్వోలు, అసిస్టెంట్ ఈఆర్వోలు, బిఎల్వోలతో సమీక్ష సమావేశం జరిగింది. నియోజకవర్గాల వారిగా క్లెయి మ్స్, ఫిర్యాదుల పరిశీలన ప్రక్రియను కలెక్టర్ పరి శీలించారు. ఈ సందర్భంగా క్లెయిమ్స్, ఫిర్యాదులను ఎలా పరిశీలించి డిస్పోజ్ చేస్తున్నారో ఆరా తీశారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరించి ఫామ్ 7 దర ఖాస్తులను ఎలా డిస్పోజ్ చేస్తున్నారనే వివరాలను అడిగి తెలుసు కున్నారు. ఫామ్ 7,8, ఫోటో సిమిలర్ ఎంట్రీలకు సంబంధించి అవసరమైన చర్యలు జాగ్రత్తగా తీసుకోవా లని, వివిధ రాజకీయ పార్టీలు లేవనెత్తిన అంశాలను పరిగణలోకి తీసుకొని అనుగుణంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశిచారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం,ఆర్డీఓ ఎం.శేషిరెడ్డి పాల్గొన్నారు.