ఆలోచనలను రేకెత్తించేలా సైన్స్‌ ఎగ్జిబిషన్‌

Nov 29,2023 23:10
ఆలోచనలను రేకె

ప్రజాశక్తి – కాకినాడ

విద్యార్థుల్లో ఆలోచనలను రేకెత్తించేలా ఆదిత్య డిగ్రీ, పిజీ కళాశాలలో 5వ సైన్స్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభం అయ్యిందని కళాశాలల అకడమిక్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బిఇవిఎల్‌.నాయుడు అన్నారు. ఆదిత్య కళాశాల మైదానంలో బుధవారం సై-లాండ్‌ -2023 కార్యక్రమం ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక జ్ఞానంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా అభ్యసించినప్పుడే పరిపూర్ణత చేకూరుతుందన్నారు. విద్యార్థులు పరిశోధకులుగా ఎదగాలని అందుకు ఈ విధమైన సైన్స్‌ ఎగ్జిబిషన్స్‌ ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థులు రూపొందించిన నూతన ప్రయోగాలు తక్కువ ఖర్చుతో సమాజహితంగా ఉన్నాయన్నారు. రెండు రోజులు జరిగే ఈ సైన్స్‌ ఎగ్జిబిషన్‌ను వివిధ కళాశాలల విద్యార్థులు సందర్శిస్తారనిన్నారు. ఈ ఎగ్జిబిషన్‌ను పిఆర్‌ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ బివి.తిరుపాణ్యం ప్రారంభించారు. కిఫీ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆదిత్య విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాలలో ముందు ఉండడం అభినందనీయమని అన్నారు. ఆదిత్య విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ నల్లమిల్లి శేషారెడ్డి, సెక్రటరీ డాక్టర్‌ నల్లమిల్లి సుగుణా రెడ్డి సైన్స్‌ ఎగ్జిబిషన్‌ ”సై-లాండ్‌” ను నిర్వహించిన సైన్స్‌ విభాగాల అధ్యాపకులను అభినందించారు

➡️