ఆర్వో ప్లాంట్‌ సమస్య పరిష్కారానికి చర్యలు

టి.నరసాపురం: మండలంలోని బొర్రంపాలెం హైస్కూల్‌లో ఆర్వో ప్లాంట్‌(తాగునీరు) సమస్య పరిష్కారానికి పోలవరం నియోజకవర్గ ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు చర్యలు చేపట్టారు. స్థానిక బొర్రంపాలెం హైస్కూల్లో నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌(ఆర్వో) మంజూరు కావడంతో అధికారులు ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. కానీ ప్లాంట్‌కు త్రీఫేస్‌ కరెంట్‌ లేక రెండు సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉందని మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంఎల్‌ఎకు బొర్రంపాలెంకు చెందిన యువకులు సమస్యను వివరించారు. దీంతో స్పందించిన ఆయన విద్యుత్‌ డిఇతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారని గ్రామానికి చెందిన యువకుడు కె.విజరు తెలిపారు.ె

➡️