ఆర్‌బికెలను సద్వినియోగం చేసుకోవాలి

Dec 1,2023 22:50 #rbk
ఫొటో : మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయ అధికారి పి.సత్యవాణి

ఫొటో : మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయ అధికారి పి.సత్యవాణి
ఆర్‌బికెలను సద్వినియోగం చేసుకోవాలి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : మండలంలోని అన్ని రైతు భరోసా కేంద్రాలలో ఎరువులు అందుబాటులో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి పి.సత్యవాణి పేర్కొన్నారు. శుక్రవారం ఆత్మకూరు మండలంలోని చెర్లో ఎడవల్లి, రామస్వామి పల్లి, రైతు భరోసా కేంద్రాల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతు భరోసా కేంద్రాల్లోని ఎరువుల లభ్యత, విత్తనాల పంపిణీని, రైతు భరోసా కేంద్రాల తనిఖీ చేశారు. ఆయా గ్రామాలలోని రైతులతో ప్రస్తుతం సాగు పోతున్న పంటలైన వరి, శనగ, సాగు పద్ధతులు విత్తన శుద్ధి సస్యరక్షణపై అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి మాట్లాడుతూ మండలంలోని అన్ని రైతు భరోసా కేంద్రాలలో ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయని శనగ, విత్తనాలు సబ్సిడీపై అందజేస్తున్నామన్నారు. ప్రస్తుత వర్షాలకు, రైతులు వరి పంటకు ప్రత్యామ్నాయంగా పత్తి, పెసర, నువ్వుల పంటలు వేసుకోవాలని సూచించారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆత్మకూరు సహాయ వ్యవసాయ సంచాలకులు వి.దేవసేనమ్మ, మండల వ్యవసాయ అధికారి కిషోర్‌ బాబు, గ్రామ సహాయకులు ఎస్‌.కె ఆయేషా, పి.ఈశ్వర్‌, ఎఇఒ కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.

➡️