ఆర్థికాభివద్ధికి బ్యాంకర్లు కృషి చేయాలి : కలెక్టర్

ప్రజాశక్తి-కడప ప్రభుత్వ ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా సేవలందిస్తూ జిల్లా ఆర్ధిక ప్రగతికి కషి చేయాలని కలెక్టర్‌ వి.విజరు రామరాజు బ్యాంకు అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన హాలులో కలెక్టర్‌ అధ్యక్షతన డిస్ట్రిక్ట్‌ కన్సల్టెటివ్‌ కమిటీ, డిస్ట్రిక్ట్‌ లెవెల్‌ రివ్యూ కమిటీ బ్యాంకర్స్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని బ్యాం కులకు నిర్దేశించిన పలురకాల లక్ష్యాలు, సాధించిన ప్రగతిని ఆయా బ్యాంకుల ప్రతినిధులతో కలెక్టర్‌ సమీక్షించారు. జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 2023 సెప్టెంబర్‌ 30వ తేదీ నాటికి జిల్లా క్రెడిట్‌ ప్లాన్‌ లక్ష్యం రూ.14,924 కోట్లకు గాను రూ.9,572.86 కోట్ల రుణాలు మంజూరు చేసి 64.14 శాతం ఆర్థిక ప్రగతిని సాధించామన్నారు. పంట రుణాలకు సంబంధించి రూ.6,676 కోట్ల లక్ష్యానికి గాను.. రూ.3,824.16 కోట్ల రుణాలను అందజేసి 57.28 శాతంఆర్థిక ప్రగతిని సాధించడం జరిగిందన్నారు. వ్యవసాయ, అను బంధ రంగాలకు మొత్తం రూ. 2,889 కోట్ల రుణ లక్ష్యం కాగా రూ.2,037.07 కోట్ల రుణాలను మంజూరు చేసి 70.51 శాతం ఆర్థిక ప్రగతిని సాధించిం దన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి రూ.9,565 కోట్ల లక్ష్యం కాగా రూ.4,056.84 కోట్ల రుణాలు అందజేసి 61.27 శాతం పురోగతి సాధించా మన్నారు. ఎస్‌ఎంఇ సెక్టార్‌ కు సంబంధించి రూ.2,045 కోట్ల లక్ష్యం కాగా రూ.1,435.03 కోట్ల రుణాలు అందజేసి 70.17 శాతం ప్రగతి సాధించా మన్నారు. ఇతర ప్రాధాన్యతా రంగాలకు సంబంధించి రూ.1,037 కోట్ల రుణ లక్ష్యం కాగా రూ.286.53 కోట్ల రుణాలు అందజేసి 27.36 శాతం ప్రగతి సాధించామన్నారు. ప్రాధాన్యత రంగాలకు గాను రూ.12,647 కోట్లు లక్ష్యం కాగా రూ.7,579.79 కోట్లు రుణాలు మంజూరు చేసి 59.93 శాతం ప్రగతి సాధించినట్లు తెలిపారు. ప్రాథాన్యేతర రంగాలకు అదనంగా రూ.2,277 కోట్ల లక్ష్యానికి గాను రూ.1,993.07 కోట్ల రుణాలు అందజేసి 87.53 శాతం పురోగతి సాధించామన్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ రుణాలు అందిం చడంలో సెప్టెంబర్‌ మాసంతానికి గాను జిల్లా పురోగమనంలో కొనసాగు తున్నందుకు బ్యాంకర్లను అభినందిస్తున్నామన్నారు. బ్యాంకర్లు సమర్థవంతంగా పని చేస్తేనే ఆర్థిక వ్యవస్థ మరింత దఢంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక రకాలయిన సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అందుకు సంబంధించి అన్ని రకాల బ్యాంకు శాఖలు ఆయా పట్టణ, గ్రామీణ పరిధిలో రుణ పథకాలకు అర్హత పొందిన లబ్దిదారులకు పెండింగ్‌ లేకుండా రుణాలు అందించాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు. గ్రామాల్లోని సచివా లయాలు, ఆర్బికేల పరిధిలో బ్యాంకింగ్‌ కరస్పాండెంట్ల సేవలను విస్త తం చేసి గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్‌, ఆర్ధిక లావాదేవీలను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. మండల స్థాయిలో మండల బ్యాంకింగ్‌ కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి నెలా ఆ మండలంలో బ్యాబకార్ల ఆర్థిక పురోగతిపై సమీక్ష నిర్వహించాలని ఎల్‌డిఎంను ఆదేశించారు. బడుగు బలహీన వర్గాల వారిని ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ”స్టాండప్‌ ఇండియా” పథకానికి సంబంధించి అన్ని బ్యాంకులు ఎంటర్ప్రెన్యూర్లకు రుణాలను అందించడంతో పాటు సంబంధిత రుణాల రికవరీని కూడా సక్రమంగా చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ముందుగా జిల్లా లీడ్‌ బ్యాంకు చీఫ్‌ మేనేజర్‌ దుర్గా ప్రసాద్‌ డిసిసి, డిఎల్‌ఆర్‌సి సమావేశంకు సంబంధించిన అజెండా, వివరాలను, పలు శాఖల ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న రుణాల ప్రగతిని ఆయా శాఖల అధికారులు కలెక్టర్‌ కి వివరించారు. సమావేశంలో డిర్‌డిఎ పీడీ ఆనంద్‌ నాయక్‌, వ్యవసాయశాఖ జిల్లా అధికారి నాగేశ్వరరావు, మెప్మా పీడీ సురేష్‌ రెడ్డి, జిల్లా హార్టికల్చర్‌ అధికారి రాజీవ్‌ మైఖేల్‌, వ్యవసాయ అనుబంధశాఖల అధికారులు, డిక్కీ కో-ఆర్డినేటర్‌ శివశంకర్‌, వివిధ బ్యాంకుల ప్రతినిధులైన జిల్లా మేనేజర్లు, ఆర్‌ఎంలు పాల్గొన్నారు.

➡️