ఆర్‌టిసి బస్టాండ్‌లో వసతులు కరువు-

ఆర్‌టిసి బస్టాండ్‌లో వసతులు కరువు-

ఆర్‌టిసి బస్టాండ్‌లో వసతులు కరువు- బస్టాండ్‌ గుంతలమయం- చీకటి పడితే కానరాని వెలుతురు- చినుకు పడితే బస్సులు రావుప్రజాశక్తి -బాలాయపల్లి : ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించలేని పరిస్థితి తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం బాలాయపల్లి మం డల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ లో నెలకొంది. వెంకటగిరి – గూడూరు రహదారి పక్కనే ఉన్న బస్టాండ్‌ విశాల ప్రాంగణం ఉన్నా..అక్కడ బస్సులు ఆగే పరిస్థితి లేదు. మండలం చుట్టు పక్కల ఉన్న సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు అక్కడ కనీస వసతులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరచూ పందులు, కుక్కలు సంచరిస్తుంటాయి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ప్రభుత్వాలు, నాయకులు మారినాఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా బాలాయపల్లి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఉంది. పరిస్థితి అధ్వానంగా తయారైంది. రాష్ట రహ దారికి ఆనుకుని ఉన్న బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు లేని పరిస్థితి నెలకొంది. ప్రయా ణికులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కూర్చునేందుకు కుర్చీలు లేవు. రాత్రైతే వెలుతురు రాదు.. ఆ ప్రాంగణం కుక్కలు, పందులకు నెలవుగా మారింది.చినుకు పడితే చిత్తడే వర్షాలు పడితే ఇక్కడి పరిస్థితి మరీ దారుణంగా తయారవుతోందని ప్రయాణికులు చెబుతున్నారు. స్థానికలు అప్పుడప్పుడూ ఓ నాలుగు ట్రాక్టర్ల మట్టి పోసి మమ అనిపించుకుంటారని ఆరోపిస్తున్నారు. బస్టాండ్‌ లోపలికి బస్‌ రావాలన్నా, పోవాలన్నా ప్రయాణికులకు, డ్రైవర్లకు కత్తి మీద సాముగా మారింది. బస్టాండ్‌ ప్రారంభం నుంచి ఏ పనులు చేసిన దాఖలాలు లేవు. ఎలాంటి సౌకర్యాలు లేవని ప్రయాణికులు అంటున్నారు.ప్రయాణికులకు తప్పని కష్టాలు బాలాయపల్లి మీదుగా నిత్యం వందలాది బస్సులు ప్రయాణిస్తూ ఉంటాయి. కొన్ని సర్వీసులైతే గుంతల కారణంగా బస్టాండ్‌లోకి రాకుండానే వెళ్తున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతు న్నాయి. పేరుకే బస్టాండ్‌ అని ఎలాంటి సౌకర్యా లు లేవని ప్రయాణికులు తీవ్ర అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు.అధికారులు స్పందించాలి బస్సు వస్తే… పెద్ద ఎత్తున బురద లేస్తుంది. ఇక గుంతలు బావిలా వుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆర్టీసీ డ్రైవర్లు వాపోతున్నారు. గుంతలమయంగా మారిన బస్టాండ్‌లోకి బస్సులు రావాలంటే ప్రయాణికుల ప్రాణాలతో ఆటలాడుకోవ డమే నని వాపోతున్నారు. ఎన్నో సంవత్స రాలుగా బస్టాండ్‌ ఇలాగే ఉందని ఇప్పటికైనా అధికారు లు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రాంగణాన్ని బాగుచేయాలని ప్రయాణికులు కోరు తున్నారు. ఈ విషయమై వెంకటగిరి డిఎం మనీ విచారణ కోసం ఫోన్‌ చేయగా అందుబాటులో లేరు.అన్ని సమస్కలే… చిన్నపాటి వర్షం వచ్చినా మోకాలు లోతు బురద వల్ల మండల కేంద్రంకు వచ్చే ప్రజల బస్టాండ్‌ లో బస్సు ఎక్కాలంటే నరకం కనిపిస్తోంది..- ఆశోక్‌ అంబలపూడి, ప్రయాణికుడు.

➡️