ప్రజాశక్తి-కలికిరి ఆర్‌టిసి డ్రైవర్ హత్య కేసులో నిందితులు అరెస్టు చేసినట్లు సిఐ సురేష్ కుమార్, ఎస్‌ఐ రహిముల్లా తెలిపారు. పోలీసులు కథనం మేరకు.. మండలం లోని గుట్టపాలెం పంచాయతీ, నల్లగుట్ట దళితవాడకు చెందిన ఆర్‌టిసి డ్రైవర్ సాలిరవి కుమారుడు హేమంత్ తన కుమార్తె హర్షిత మతికి కారణమనే అనుమానముతో, పీలేరు ఆర్‌టిసి డిపోలో మెకానిక్‌గా పనిచేసే ఆనంద, అతని బామర్ది అంజనేయులు భార్య లక్ష్మీదేవి, లీలావతితో కలిసి కుట్ర పన్ని ప్రస్తుతం హేమంత్ చింతామణి జైలులో వున్నందున, అతని తండ్రి రవిని అంతమొందిం చాలని పలుమార్లు ప్రయత్నించారని తెలిపారు. నవంబర్ 13 తేదీన ఉదయం 9.10 గంటలపుడు రవి తన ద్విచక్ర వాహనం పై నల్లగుట్ట హరిజనవాడ నుంచి డ్యూటి కి వెళ్ళుటకు కలికిరికి వస్తూండగా వూరికి సమీపములో లక్ష్మయ్య బొప్పాయి తోట వద్ద ఆటోలో కాపు కాసిన ఆనంద, అతని బామ్మర్ది అంజనేయులు డ్రైవర్ రవి అక్కడికి రాగానే అడ్డుకొని, వెనుక వైపు నుండి ఆనంద ఇనుప రాడ్డుతో రవి తల వెనుక బలంగా కొట్టడముతో క్రింద పడిపోగా, వెంటనే ఇద్దరు కలిసి రవిని చనిపోయేదాకా రాడ్లతో అతని తలపై బలముగా చితకబాది, శవాన్ని ఆటోలో వేసుకొని వెళ్ళి, రవికి చెందిన బ్యాగు, హత్యకు ఉపయోగించిన రెండు రాడ్లను అగ్రహారం వెళ్ళే రోడ్డులో గార్గేయనదిలో పారవేసి, మృతదేహాన్ని రైలు ట్రాక్ పై పడవేసి ఆత్మహత్య గా చిత్రీకరించడానికి ప్రయత్నించారని చెప్పారు. శవాన్ని అదే రోజు రాత్రి రైలు తొక్కించుకొని వెళ్లడంతో కదిరి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి రైల్వేపోలీసు సిఐ డి.నాగరాజు పరిశీలించి అది హత్యగా తెల పడంతో కలికిరి పోలీసులకు ఉన్నతాధికారుల ద్వారా కేసు అప్పగించారని అన్నారు. ఎస్‌పి బి.కష్ణారావు, రాయచోటి డిఎస్‌పి మహబూబ్‌బాషా ఆదేశాల మేరకు సత్వరమే కేసును చేంచి, తమ సిబ్బంది ఎఎస్‌ఐ మదుసూదనాచారి, మహమ్మద్‌అలీ, రవిశేఖర్ (టెక్నికల్ వింగ్), మణిరత్నం, నాగరాజు, సతీష్, అబ్దుల్లా, అమరనాధ్, జిలానీ, తేజోవతి, హోంగార్డులు నిజా ముద్దీన్, ప్రతాప్‌రెడ్డి లతో కలికిరి-పీలేరు రోడ్డు నందు అంకాలమ్మ గుడి వద్ద కాపుకాచి మదనపల్లె వైపు పారిపోతున్న నిందితులను అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన రాడ్లను, ఆటోను సీజ్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కేసును వాయల్పాడు సిఐ సురేష్‌కుమార్ దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.