నిరసన తెలుపుతున్న ఉద్యోగులు
ఆర్టిసి ఉద్యోగులకు ఓపిఎస్ అమలు చేయాలి
ప్రజాశక్తి-నెల్లూరు : ఆర్టిసి ఉద్యోగులందరికీ ఓ.పి.ఎస్. అమలు చేయాలని, జి.పి.ఎస్ పై ప్రభుత్వ విధి విధానాలు వచ్చేవరకు సిపిఎస్, ఈపీఎస్ 95 ఆప్షన్ అడిగే విధానాన్ని ఆపాలంటూ ఎస్‌డబ్ల్యూఎఫ్, ఏఐఆర్టిడబ్లూఎఫ్ జిల్లా కమిటీలు డిమాండ్ చేశాయి. బుధవారం నగరంలోని ఆర్టిసి డిపోలో ఎస్‌డబ్ల్యూఎఫ్, ఎఐఆర్‌టిడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ పాలస్తీనాపై ఇజ్రా యిల్ చేస్తున్న దాడులను తక్షణమే నిలిపి వేయాలన్నారు.రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కట్టా. సుబ్రమణ్యం, జిల్లా కార్యదర్శి ఎ కష్ణయ్య, ప్రచార కార్యదర్శి టి. దశరథ, నెల్లూరు 1 డిపో నాయకులు వెంకటేశ్వర్లు, జయ రామయ్య, నెల్లూరు 2.డిపో కార్యదర్శి. కె.చంద్రయ్య ,1, 2 డిపో కార్యకర్తలు పాల్గొన్నారు.