సత్తెనపల్లి రూరల్: ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను విజయవంతం చేయాలని సత్తెనపల్లి ఎంపిడిఒ జీవి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. సత్తెనపల్లి ఎంపిడిఓ కార్యాలయంలో పంచాయతి కార్యదర్శులకు క్రీడా పరికరాల కిట్లను గురు వారం ఆయన పంపిణీ చేశారు. ఎంపిడిఒ మాట్లాడుతూ డిసెంబర్ 15 నుండి 2024 జనవరి 3 వరకు వివిధ స్థాయిల్లో పోటీలు జరుగుతాయని చెప్పారు. క్రీడాకారులు వారి పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
