సత్తెనపల్లి రూరల్: అర్హులైన రైతులందరికీ వైయస్సార్ జళకళ పథకాన్ని అందిస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లి ఎంపిడిఓ కార్యాలయంలో వైయస్సార్ జలకళ పధకం కింద రైతులకు పంపుసెట్లు మంత్రి అంబటి రాంబాబు శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడులతూ వ్యవ సాయానికి అండగా నిలిచేందుకు జలకళ పథకం ఎంత దోహదపడు తోందని అన్నారు. మండల పరిధిలో 160 మందికి ఈ పథ కాన్ని వర్తింపజేసేందుకు పరిపాలనా అనుమతులు లభిం చగా అందులో 34 మందికి బోర్వెల్స్ వేయించడం జరిగిం దన్నారు. వీరిలో 19 మంది రైతులకు విద్యుత్ సరఫరా కూడా ఏర్పాటు చేశామన్నారు. మొదటి విడతగా 9 మందికి పంపుసెట్లను మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు సలహా మండలి సభ్యులు కళ్ళం విజయభాస్కర్‌రెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ పాల్గొన్నారు.