అర్హులకు కేంద్ర పథకాలు అందేలా చర్యలు

పేరూరులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

ప్రజాశక్తి-అమలాపురం రూరల్‌

కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలుతో పాటుగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా కూడా అర్హులైన లబ్ధిదారులకు మరింతగా ప్రయోజనం చేకూర్చేందుకు చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అన్నారు. శుక్రవారం పేరూరు గ్రామంలో వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర ప్రచార కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతం బాగా వెనుకబడిన ప్రాంతమని, తాగునీటి సమస్యలు ఉన్నాయన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద మంజూరు చేస్తున్న నిధులు స్థానికంగా డెల్టా ప్రాంతం కావడంతో రూ.1.8 లక్షలు గృహ నిర్మాణానికి సరిపోవడంలేదని, యూనిట్‌ కాస్ట్‌ ను రూ.5 లక్షల వరకు పెంచాలని, తాగునీటి సమస్య పరిష్కారానికి ధవళేశ్వరం నుంచి ప్రతిపాదించిన వాటర్‌ గేట్‌ పథకానికి కేంద్రం సహకరించాలని కోరారు. కేంద్ర ఆర్థిక శాఖ సంచా లకులు శోభిత్‌ గుప్తా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల అర్హులకు చేర్చాలనే లక్ష్యంతో వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర ప్రచార కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించిందని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజల్ని, ముఖ్యంగా కేంద్ర సంక్షేమ పథకాల లబ్ధిదారుల్ని చేరుకుని అర్హులందరికీ ఆ పథకాలు అందేలా చూసేందుకు ముందుగా గిరిజన ప్రాంతాలలో ప్రచారాన్ని ప్రారంభించారన్నారు. వచ్చే ఏడాది జనవరి 25 నాటికి దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో యాత్ర కొనసాగుతుందన్నారు. ప్రతి ప్రచార వాహనం రెండు గంటలపాటు గ్రామ పంచాయతీలో ఉండి, ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉన్న అర్హులైన లబ్దిదారులను గుర్తించి వారికి వాటిని అందేలా చూస్తుందన్నారు. దిగువ, మధ్య తరగతి జనాభాకు కేంద్ర పథకాల ప్రయోజనాలను పొందేలా చూడడమే లక్ష్యంగా నిర్దేశించారన్నారు.ఈ సంకల్ప యాత్ర తదితర సంక్షేమ అభివృద్ధి పరకాల ద్వారా 2047 సంవత్సరం నాటికి భారత దేశాన్ని ప్రపంచంలో మూడవ అభివద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ప్రధానమంత్రి సంకల్పించారన్నారు. ప్రధానంగా 17 రకాల కేంద్ర ప్రభుత్వ పథకాలు అందరికీ చేరాలన్నదే ముఖ్య సంకల్పమన్నారు. జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ ఈ ప్రాంతం బాగా వెనుకబడిన ప్రాంతమని, తాగునీటి సమస్యలు ఉన్నాయని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద మంజూరు చేస్తున్న నిధులు స్థానికంగా డెల్టా ప్రాంతం కావడంతో రూ.1.8 లక్షలు గృహ నిర్మాణానికి సరిపోవడంలేదని, యూనిట్‌ కాస్ట్‌ ను రూ.5 లక్షల వరకు పెంచాలని, తాగునీటి సమస్య పరిష్కారానికి ధవళేశ్వరం నుంచి ప్రతిపాదించిన వాటర్‌ గేట్‌ పథకానికి కేంద్ర సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ జి.కేశవర్ధన్‌ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వి.కష్ణ కుమారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పథక సంచాలకులు వి.శివ శంకర్‌ ప్రసాద్‌, యాళ్ల దొరబాబు, వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ ఖాదర్‌, జెడ్‌పిటిసి సభ్యుడుపందిరి శ్రీహరి, సర్పంచ్‌ దాసరి అరుణ, ఉప సర్పంచ్‌ కె. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️