అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు

Nov 25,2023 23:26
కొవ్వూరు రూరల్‌లో

ప్రజాశక్తి – కొవ్వూరు రూరల్‌, చాగల్లు

అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని హోంమంత్రి డాక్టర్‌ తానేటి వనిత అన్నారు. గడప గడపకూ-మన ప్రభుత్వం కార్యక్రమంలో శనివారం రూరల్‌ మండలం ఆరికిరేవుల గ్రామంలో మంత్రి పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి వనిత మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. చాగల్లు పంచాయితీలోని 5 సచివాలయాల పరిధిలో నిర్వహించిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్యమైన రీతిలో స్పందన వచ్చిందని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. శనివారం గడప గడపకూ కార్యక్రమాన్ని సచివాలయం – 4 పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్లి సిఎం జగన్‌ పాలనలో అందించిన పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం సచివాలయం భవనం వద్ద విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. భారీ కేక్‌ను కట్‌ చేసి అందరికీ పంపిణీ చేశారు. పూలదండలతో, శాలువాతో మంత్రిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ అధికారులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, నాయకుల సమన్వయం, సహాకారంతో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం దిగ్విజయంగా ముగిసిందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్‌పి వైస్‌ ఛైర్‌పర్సన్‌ పోసిన శ్రీలక్ష్మి, సర్పంచ్‌ ఉన్నమట మనశ్శాంతి, ఉప సర్పంచ్‌ మేక రాజు, మండల వైస్‌ ప్రశిడెంట్‌ జుజ్జువరపు రామచం ద్రరావు, సర్పంచ్‌లు వెంకట్రావు, కుదప రాంబాబు, వైసిపి నాయకులు జి.సురేంద్ర కుమార్‌, జె.ఏడుకొండలు, జి.రాజేంద్రప్రసాద్‌, ఎంపిడిఒ బి.రాంప్రసాద్‌, తహశీల్దార్‌ కె. రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

 

➡️