ప్రజాశక్తి-యంత్రాంగం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేయడమే వైసిపి లక్ష్యమని పలువురు ప్రజాప్రతినిధులు అన్నారు. శుక్రవారం వై ఎపి నీడ్స్ జగన్ కార్యక్రమాలు పలుచోట్ల నిర్వహించారు. కాకినాడ అర్హత కలిగిన ప్రతి ఒక్క లబ్థిదారునికి సంక్షేమ పథకాలు అందిస్తామని కాకినాడ సిటీ ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి స్పష్టం చేశారు. ఎక్కడైనా అర్హత ఉండి సాంకేతిక కారణాలతో పథకాలు అందకపోతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. 16వ డివిజన్ గోగుదానయ్యపేటలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల బోర్డును ఆయన ఆవిష్కరించారు. ఎంఎల్‌సి కర్రి పద్మశ్రీ, వైసిపి నగరాధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, ఎఎంసి ఛైర్‌పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి, ఎం.ఏసుబాబు, పేర్ల జోగారావు, పేర్ల రజిని కుమార్ పాల్గొన్నారు. యు.కొత్తపల్లి వైసిపి మండల అధ్యక్షుడు ఆనాల సుదర్శన్ కొమరగిరి సచివాలయం-1లో మాట్లాడారు. శెట్టిబత్తుల నాని, ఉమ్మిడి జాన్, మేడే యనమలరెడ్డి, గొల్లపల్లి సత్యనారాయణ, నురుకుర్తి వెంకటలక్ష్మి, కటారి చంటిబాబు, దాసరి పెద్దకాపు, మేడే సోమరాజు, జొన్నాడ సత్యనారాయణ, చింతల స్వామి, అన్నవరం జిల్లా సుధీర్ పాల్గొన్నారు. కాజులూరు వైసిపి మండల అధ్యక్షుడు గుబ్బల యేసు రాజు గొల్లపాలెంలో సర్పంచ్ పోతురాజు ప్రసన్న మౌనిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. జెడ్‌పిటిసి వనుం వెంకటసుబ్బారావు, ఎంపిపి మాత భారతి మురళి, సత్తి శ్రీరామారెడ్డి, గండి కిషోర్, సోమరాజు, నరాల సుబ్బరాజు, దండంగి చిన్నారావు, సర్పంచులు గుంటూరు అప్పారావు, నెల్లి బ్రహ్మాజీ, నల్లమిల్లి ఈశ్వర రెడ్డి, తాడి వాసు రెడ్డి పాల్గొన్నారు. పెదపూడి ఎంపిపి కేతా తులసి శ్రీనివాస్ గండ్రేడులో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. సర్పంచ్ కుడిపూడి మాధవీలత శ్రీనివాస్, ఉప సర్పంచ్ కర్రి శ్రీను, పార్టీ మండల కన్వీనర్ గుత్తుల వెంకటరమణ, కో ఆప్షన్ సభ్యుడు కర్రి శ్రీవెంకటరెడ్డి పాల్గొన్నారు. సామర్లకోట రూరల్ రాష్ట్ర హౌసింగు కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు పెదబ్రహ్మదేవంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. ఎంపిటిసి మలకల సూర్యారావు, సర్పంచ్ నీలపాల సత్యనారాయణ, ఎంపిపి బొబ్బరాడ సత్తిబాబు, సర్పంచ్ నీలపాల సత్యనారాయణ, మలకల వరాలబాబు, తోటకూర బాబీస్, తోటకూర గంగాధర్, తహశీల్దారు ఎస్.లక్ష్మీ నరసకుమారి పాల్గొన్నారు. పెదపూడిలో పథకాల బోర్డు ఆవిష్కరిస్తున్న నాయకులు