అరవిందో ఫార్మా సిబ్బందికి ఎమ్‌డిపి శిక్షణ

ఎమ్‌డిపి శిక్షణ

ప్రజాశక్తి -మధురవాడ: గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంతో ప్రముఖ ఔషధ పరిశ్రమ అరవిందో ఫార్మా లిమిటెడ్‌ ఉద్యోగస్తులకు ప్రత్యేక మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమం (ఎమ్‌డిపి) బుధవారం ప్రారంభమైంది. ఆరో అస్త్ర పేరిట నిర్వహిస్తున్న ఈ ఎమ్‌డిపి శిక్షణలో భాగంగా అరవిందో ఫార్మా మధ్య స్థాయి మేనేజర్లకు గీతం స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ప్రొఫెసర్లు వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించిన అరబిందో ఫార్మా సీనియర్‌ ఉపాధ్యక్షుడు (హెచ్‌ఆర్‌) యుఎన్‌బి. రాజు మాట్లాడుతూ, సహ ఉద్యోగస్తులతో కలిసి బృందంగా పనిచేయడం, సంస్థ ప్రగతిలో వ్యక్తిగత నైపుణ్యాలను ఉపయోగించడం, కాలానుగుణ మార్పులను అర్ధం చేసుకుని సవాళ్ళను అధిగమించడం వంటివి అంశాలపై శిక్షణ ఉంటుందని వెల్లడించారు. గత ఏడాది తమ సంస్థలో పనిచేస్తున్న సీనియర్‌ ఎగ్జిక్యూటివ్లకు గీతం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ నిపుణులు ఇచ్చిన శిక్షణ విజయవంతం కావడంతో సంస్థలోని ఇతర ఉద్యోగులకు గీతంలో శిక్షణను కొనసాగించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. గీతంతో తమ అనుబంధం కొనసాగుతుందన్నారు.కార్యక్రమంలో అరబింధో ఫార్మా కార్పొరేట్‌ క్వాలిటీఅధ్యక్షుడు డాక్టర్‌ రామశ్రీనివాస్‌, గీతం స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ డీన్‌ ప్రొఫెసర్‌ రాజా పి. పప్పు, గీతం కన్సల్టెన్సీ, కొలాబిరేషన్స్‌ డిప్యూటీ డైరక్టర్‌ సోంభట్‌ శాస్త్రి, గీతం స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జి.శ్రీలలిత, అరవిందో ఫార్మా జనరల్‌ మేనేజర్‌ సి. సుహస్రామ్‌ పాల్గొన్నారు.

 

శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్న రాజు

➡️