ప్రజాశక్తి – ఏలేశ్వరం
మండలంలోని ఎర్రవరం గ్రామానికి చెందిన రాయి అప్పలరాజుకు చెందిన అరటి తోటలో గత మూడు రోజు లుగా గుర్తుతెలియని అడవి జంతువు సంచ రించి అరటి చెట్లను ధ్వంసం చేస్తుంది. జంతువు పాదముద్రలు పెద్దగా ఉండడంతో రైతులు భయాందోళనకు గురై అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ మేరకు గురువారం ఏలేశ్వరం రేంజ్ ఆఫీసర్ దుర్గా సాయిప్రసాద్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పాదముద్రలు సేకరించి సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు రాత్రి సమయాల్లో పొలాల్లోకి వెళ్ళొద్దని హెచ్చరించారు. పాదముద్రలు, అరటి చెట్లపై గీసిన కాలి గోర్లు గుర్తులను బట్టి అడవి జాతికి చెందిన ‘ఐనా’ అనే జంతువు కానీ, చిరుతపులి గాని అయి ఉండే అవకాశం ఉందన్నారు. ఈ పర్యటనలో డిఆర్‌ఓ జాన్సన్, బీట్ ఆఫీసర్లు మీనాక్షి, మూర్తి ఉన్నారు.