ప్రజాశక్తి – టి.నరసాపురం భూమికోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం ప్రాణాలర్పించిన విప్లవ అమర వీరులను స్మరించుకుంటూ మండలంలోని మర్రిగూడెంలో నవంబర్ 27న నిర్వహించనున్న అమరవీరుల సభను జయప్రదం చేయాలని సిపిఐఎంల్ జిల్లా కార్యదర్శి భాస్కర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు సత్తిరాజు మర్రిగూడెంలో భూ పోరాటాలు చేసి 80 ఎకరాలకు పైగా సాధించి ఆదివాసి ప్రజలకు పంచారన్నారు. నవంబర్ 27న మర్రిగూడెం ప్రాంతంలో నిర్వహించే సత్తిరాజు సభను విజయవంతం చేయాలని ప్రజా సంఘాలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అరుణోదయ సాంస్కృతిక సమైక్య తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ విమలక్క పాల్గొంటున్నారన్నారు. ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుర్సం నిరీషణ రావు, కుంజా విరాస్వామి, కట్టాం కటయ్య పాల్గొన్నారు.