అభివృద్ధి, పథకాలపై వైసిపి ప్రచారం

వైసిపి ప్రచారం

ప్రజాశక్తి-గోకవరం, ఉండ్రాజవరం, కడియంమండలంలోని కృష్ణునిపాలెంలో సర్పంచ్‌ రౌతు ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో బుధవారం వై ఎపి నీడ్స్‌ జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఎంపిపి సుంకర శ్రీవల్లి పాల్గొని నాయకులతో కలిసి సంక్షేమ పథకాల లబ్ధిని తెలిపే డిజిటల్‌ బోర్డును ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. వైసిపి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపిపి శ్రీవల్లి మాట్లాడుతూ జగ్గంపేట ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు ఆదేశాల మేరకు గ్రామంలో సుమారు రూ.16 కోట్లతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్ట్నిట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు సుంకర వీరబాబు, వైసిపి కన్వీనర్‌ పాటి రాంబాబు, సొసైటీ అధ్యక్షుడు గాజింగం సత్తిబాబు, రౌతు జోగేశ్వరరావు, తోలేటి రమ్యశ్రీ ప్రసాద్‌, ప్రసన్న, కర్రి శివరామకృష్ణ, వైస్‌ ఎంపిపి మడికి మైనర్‌ బాబు, కర్రి సూరారెడ్డి, పెనుగొండ సత్యానందం, ఎంపిడిఒ కె.పద్మజ్యోతి, ఇఒపిఆర్‌డి ఎం.రాజేశ్వరరావు, శివయ్య పాల్గొన్నారు. ఉండ్రాజవరం మండలంలోని చివటం, పంచాయతీ కార్యాలయంలో బుధవారం వై ఎ పి నీడ్స్‌ జగన్‌, జగనన్న నువ్వే మా నమ్మకం, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల పట్టిక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జెడ్‌పిటిసి నందిగం భాస్కర రామయ్య, ఎంపిపి పాలాటి యల్లారీశ్వరి మాట్లాడుతూ చిన్నచిన్న గ్రామాలకు సైతం రూ.కోట్ల నిధులు విడుదల వుతున్నాయని చెప్పారు. జెసిఎస్‌ చైర్మన్‌ కఠారి సిద్ధార్థ రాజు, కొఠారు సత్యనారాయణ, గంటిన లక్ష్మీ గణపతి, కానూరి వీరాస్వామి, శివ, కోలా గణపతి, గుత్తికొండ శ్రీనివాసు, ఇఒపిఆర్‌డి, జెడివి.ప్రసాద్‌, పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి పాల్గొన్నారు. కడియం మండలం కడియపులంకలో వైసిపి మండల అధ్యక్షుడు యాదల సతీష్‌ చంద్ర స్టాలిన్‌ ఆధ్వర్యాన సచివాలయం-1 వద్ద ఆంధ్రప్రదేశ్‌ కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం నిర్వహించారు. కడియపులంక సొసైటీ చైర్మన్‌ తిరుమల శెట్టి శ్రీను, బోడపాటి సత్యనారాయణ, మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్‌ ఈలి గోపాలరావుతో జెండాను ఆవిష్కరించారు.

➡️