ప్రజాశక్తి-మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలో అనుమతి లేని కట్టడాలు తొలగిస్తారా లేక అడ్డుకోమంటారా అని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు ప్రశ్నించారు. పట్ట ణంలో అక్రమ నిర్మాణాలు తొలగించాలని శనివారం మున్సిపల్ కమిషనర్‌కు టిపిఎస్ జగదీశ్వర్‌రెడ్డి ద్వారా వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివా సులు మాట్లాడుతూ పట్టణంలో సామాన్యులు అనుమతి లేని గహ నిర్మాణాలు చేస్తున్నట్లు తెలిసిన మరుక్షణం సచివాలయం సిబ్బంది నుంచి మున్సిపల్ అధికారుల వరకు వాలిపోయి నానా యాగి చేసి తొలగించే వరకు వదిలిపెట్టరని పేర్కొన్నారు. అలాంటిది చౌడేశ్వరి కల్యాణ మండపం పక్కన ఎలాంటి అనుమ తులు లేకుండానే పిల్లర్లు వేసి భారీ భవన నిర్మాణం జరుగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. నిర్మాణం చేస్తున్న నరసింహారెడ్డి ఎమ్మెల్యే చెప్పాడు, అధికారులు అండగా ఉన్నారు నన్ను ఎవరు ఏమీ చేయలేరు, అందుకే అధికారులు ఇటువైపు రాలేరని బాహాటంగా ప్రచారం చేస్తున్నాడని పేర్కొన్నారు. అయినా అధికారులు స్పందించలేదంటే అధికారులు ఎమ్మెల్యే అనుచరులుగా మారిపోయారా అని ప్రశ్నించారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో అమ్మచెరువుమిట్టలో అనుమతులు లేవనే పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టించిన ఎమ్మెల్యే నవాజ్ బాషకు రింగ్ రోడ్డులో నరసింహారెడ్డి చేస్తున్న అనుమతులు లేని నిర్మాణం ఎలా సక్రమమో వివరించాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలు తొల గించాలని లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో అడ్డుకుంటామని హెచ్చరించారు. స్పందించిన టిపిఎస్ టిపిఎస్ జగదీశ్వర్‌రెడ్డి నరసింహారెడ్డికి నోటీసులు అంద జేశామని, స్పందించకపోతే కూల్చివేత నోటీసులు అందజేస్తామని తెలిపారు.