అధిక ఫారం-7లపై త్రిసభ్య కమిటీతో పరిశీలన

ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలో ఓటర్ల జాబితాలో ఉన్న ఫొటో సిమిలర్‌ ఎంట్రీలు (పీఎస్‌ఇ), డెమాగ్రాఫిక్‌ సిమిలర్‌ ఎంట్రీలను (డీఎస్‌ఈ)లు ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారమే పరిశీలించి, పరిష్కరిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టరే ట్‌లో జేసీ రాజకుమారి, నగర కమిషనర్‌ కీర్తీ చేకూరి, తెనాలి సబ్‌కలె క్టర్‌ గీతాంజలిశర్మ, డిఆర్‌ఒ కె.చంద్రశేఖ ర్‌రావుతో కలసి ఓటర్ల జాబితా స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌-2024పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితాలో ఉన్న పీఎస్‌ఈ, డీఎస్‌ఈ వివరాల ప్రకారం ఓటరు నమోదు అధికారులు (ఈఆర్వోలు) ఫార్మేట్‌-ఎ ని జనరేట్‌ చేసి, రిజిస్టర్‌ పోస్ట్‌ ద్వారా సంబంధిత ఓటరు ఇంటికి పంపుతామన్నారు. 15 రోజుల్లో రిజిస్టర్‌ పోస్ట్‌ అందుకున్న ఓటరు సిమిలర్‌ ఎంట్రీకి సంబంధించి తనకు ఎక్కడ ఓటు కావాలో ఫార్మేట్‌లో నిర్దేశించిన ప్రాంతంలో టిక్‌ చేసి ఈఆర్వోకు తిరిగి పోస్ట్‌ చేయాల్సి ఉంటుందన్నారు. నిర్దేశిత సమయంలో ఓటరు నుంచి రిప్లై రాకపోతే బీఎల్వో క్షేత్ర స్థాయిలో పరిశీలించి, నమోదు చేసిన వివరాలు ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనిపై రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించి సిమిలర్‌ ఎంట్రీలు ఉన్న ఓటర్లు వారు ప్రస్తుతం నివాసం ఉన్న ప్రాంతంలోనే ఓటు ఉండేలా ఫార్మేట్‌-ఏలో టిక్‌ చేసి సంబంధిత ఈఆర్వోకి తిరిగి రిజస్టర్‌ పోస్ట్‌ చేసేలా అవగాహన కల్పించాలన్నారు. ఎస్‌ఎస్‌ఆర్‌-2024కి సంబంధించి వచ్చిన క్లైయిమ్‌లను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తామన్నారు. ఒక వ్యక్తి ఐదు కంటే ఎక్కువ ఫారం-7లు నమోదు చేస్తే అలాంటి క్లైమ్స్‌ను త్రిసభ్య కమిటీ స్వయంగా పరిశీలించి ఓటరు నమోదు అధికారికి క్లెయిమ్‌ ఎవరిపై పెట్టబడినదో వారి సాధారణ నివాస పరిస్థితులు పరిశీలించి నివేదిక సమర్పిస్తారన్నారు. త్రిసభ్య కమిటీ నివేదిక మేరకు ఓటరు నమోదు అధికారి ఫారం -7 క్లెయిమ్‌ పెట్టిన వారికి మరియు ఎవరి పేరు తొలగించవలెనో వారికి నోటీసులు ఇచ్చి విచారిస్తారు. తదుపరి విచారణలో ఓటర్లు స్థానికంగా సంబంధిత డోర్‌ నంబర్లో ఉన్నప్పటికీ ఉద్దేశ్యపూర్వకంగా అర్హులైన ఓటర్లును తొలగింపుకు ఫారం 7లు దరఖాస్తులు చేసే వారిపై ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని వివరించారు. సమావేశంలో ఆప్‌ నాయకులు డాక్టరు టి.సేవాకుమార్‌, బిఎస్‌పి నాయకులు సిహెచ్‌.వాసు, బిజెపి నాయకులు ఆర్‌.భా స్కరరావు, సిపిఎం నాయకులు వై.కృష్ణ కాంత్‌, కాంగ్రెస్‌ నాయకులు బి.సునీల్‌, టిడిపి నాయకులు కె.శివరామయ్య, వైసిపి నాయకులు ఎ.జోసఫ్‌కుమార్‌, ఈఆర్వోలు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు ఎ.రవిందరరావు, లక్ష్మీకుమారి, ఆర్డీవో శ్రీకర్‌, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ కె.లక్ష్మీ శివజ్యోతి పాల్గొన్నారు. బిఎల్‌ఒలు రిజిస్టర్‌ తప్పనిసరిగా నిర్వహించాలిప్రతి బిఎల్‌ఓ తప్పనిసరిగా ఓటర్ల చేర్పులు, తొలగింపుల రిజిస్టర్‌ నిర్వహిం చాలని, ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్‌, తూర్పు నియోజకవర్గ ఈఆర్‌ఓ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. బుధవారం కమిషనర్‌ క్యాంప్‌ కార్యాలయంలో ఎన్నికల విభాగ విధుల నిర్వహణపై ఏఈఆర్‌ఓలతో సమీక్షించారు. క్షేత్ర స్థాయిలో ఓట్ల చేర్పులు, తొలగింపులకు, 17-18 ఏళ్ల ప్రోస్పెక్టివ్‌ వివరాలు, షెల్టర్‌లెస్‌ ఓటర్ల వివరాలకు సంబంధించిన రిజిస్టర్‌ తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ఒక్కరికే రెండు ప్రాంతాల్లో ఓట్లు ఉన్నవారికి పియస్సి/డియస్సీ, ఫార్మేట్‌-ఏ ద్వారా రిజిస్టర్‌ పోస్ట్‌ చేయాలన్నారు. ఓటర్ల నుండి వచ్చిన కన్ఫర్మేషన్‌ లెటర్‌ ద్వారా సరి చేయాలని, సదరు వివరాలను ఏఈఆర్‌ ఓలు ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించాలని స్పష్టం చేశారు. బిఎల్‌ఓలు సెలవులో ఉన్నా లేదా క్రమశిక్షణా చర్యలుకు గురై ఉన్నా వారి స్థానంలో నూతన బిఎల్‌ఓలను కేటాయిం చాలని ఎన్నికల విభాగ సూపరిండెంట్‌ ని ఆదేశించారు. రాజకీయ పార్టీల నుండి, ప్రజల నుండి అందిన ఫారాలను ఎప్పటిక ప్పుడు ఆన్‌ లైన్‌ ద్వారా పరిష్కరించా లన్నారు. సూపర్వైజరి అధికారులు తమ పరిధిలోని బిఎల్‌ఓలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల విధుల్లో ఉండాల న్నారు. సమావేశంలో పశ్చిమ ఈఆర్‌ఓ, అదనపు కమిషనర్‌ కె.లక్ష్మీ శివజ్యోతి, ఏఈఆర్‌ఓలు, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్‌.శ్రీనివాస్‌, బి.శ్రీనివాసరావు, సిటి ప్లానర్‌ ప్రదీప్‌ కుమార్‌, సూపరిండెంట్లు సాంబశివరావు, పద్మ పాల్గొన్నారు.

➡️