ప్రజాశక్తి – గోకవరం
మండలంలోని కృష్ణునిపాలెం గ్రామానికి చెందిన కండేపల్లి వెంకటేశ్వరరావు ఇల్లు విద్యుత్ షార్ట్సర్య్కూట్తో దగ్ధం అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఎంఎల్ఎ జ్యోతుల చంటిబాబు తండ్రి జ్యోతుల రామస్వామి స్థానిక నాయకులతో కలిసి ఆ కుటుంబాన్ని పరామర్శించి రూ.10 వేలు ఆర్థిక సాయంతోపాటు, బియ్యం ప్యాకెట్, కూరగాయలు, వంట సామాగ్రి, నూతన దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ ఎప్పుడు ఏకష్టం వచ్చినా అండగ ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు దాసరి రమేష్, సుంకర వీరబాబు, కర్రీ సూరారెడ్డి, రౌతు జోగేశ్వరరావు, చింతల అనిల్ కుమార్, బిజ్జి రాజు, మచ్చ మోహన్, అంబటి ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు.