అంగన్వాడీల సమ్మె సైరన్‌

Nov 30,2023 23:08 #anaganwadi, #guntur malleswari, #strike
సమ్మె కరపత్రాలు ఆవిష్కరిస్తున్న యూనియన్‌ నాయకులు

పల్నాడు జిల్లా : ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేత హోదాలో అంగన్వా డీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అమలు చేయలేదని ఎపి అంగ న్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటూరు మల్లేశ్వరి విమర్శిం చారు. స్థానిక పల్నాడు విజ్ఞాన కేం ద్రంలో గురువారం ఎపి అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. మల్లీశ్వరి మాట్లా డుతూ తెలంగాణ రాష్ట్రంలో కన్నా వెయ్యి రూపా యలు అదనంగా ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టు కోలేదని, దీనిని నిర సిస్తూ ఈ నెల 8 నుండి సమ్మె చేపట్ట నున్నట్టు చెప్పారు. మాతాశిశు సంరక్ష ణకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సమీకృత బాలల అభివృద్ధి పథకంలో సిబ్బంది పలు సమ స్యలతో సతమతమవు తున్నారని, ప్రభు త్వం రకరకాల యాప్‌ ల పేరుతో పని ఒత్తిడికి గురిచేస్తోందని, బిల్లులు మం జూరులో జాప్యం తదితర సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గత రెండేళ్లుగా ఎన్నో పోరా టాలు చేసినప్పటికీ ప్రభుత్వం దిగి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీల విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని డిమాండ్‌ చేశారు. యాప్‌ లు అన్నింటిని తొలగించి ఒక యాప్‌ ద్వారానే కార్యక్రమం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చిన ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ఇంతవరకు ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేదని మండిపడ్డారు. ప్రభుత్వం, ప్రజా ప్రతి నిధులు అధికారులు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా సమస్యలు పరిష్కరించే వరకు నిరసన తప్పదని హెచ్చరించారు. యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు కెపి మెటిల్డా దేవి మాట్లాడుతూ అంగన్వా డీలతో వెట్టిచాకిరి చేయించుకుని, రిటై ర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఏమి ఇవ్వకుండా వారిని ఇంటికి పంపిస్తున్నారన్నారు. రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయని, ఈ నేప థ్యంలోనే అర్హులకు పదోన్నతులు ఇవ్వ డం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2017 నుండి అంగన్వాడీలకు టిఎ బిల్లులు ఇవ్వలేదని, ఎట్టి పరిస్థితిలో డిసెంబర్‌ 8 నుండి సెంటర్లు ఓపెన్‌ చేసే ప్రసక్తే లేదని, అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, పదవీ విరమణ సాయం కింద రూ 5 లక్షలకు పెంచాలని, మినీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా మార్చాలని, మొదలైన డిమాండ్లు చేశారు. కార్మిక సంఘాల మద్ద తుతో చేపట్టనున్న సమ్మె సమస్యలు పరిష్కరించే వరకూ కొన సాగుతుందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయండి అంగన్వాడీలు రోడ్డెక్కడం ప్రభుత్వ వైఫ ల్యానికి నిదర్శన మని శ్రామిక మహిళ సమ న్వయ కమిటీ కన్వీ నర్‌ డి.శివకుమారి విమర్శించారు. ఐసి డిఎస్‌ కు నిధులు కేటాయించి పేస్‌ యాప్‌ నిర్ణయాన్ని ఉపసంహరించాలని, అమ్మ ఒడి ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అంగన్వాడీలకు వర్తింపజేయాలని, నాణ్య మైన సరుకులను ప్రభుత్వమే ఇవ్వాలని, విధుల్లో మృతి చెందిన అంగ న్వాడీలకు సిబ్బంది కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పోరాటాల ద్వారా హక్కులు సాధించుకోవాలని, తల పెట్టనున్న సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. చరవాణి లు సక్రమంగా పనిచేయట్లేదు ప్రభుత్వం సర ఫరా చేసిన చరవాణిలు సక్రమంగా పనిచేయక పోవడంతో అంగ న్వాడీలు ఇబ్బంది పడు తున్నారని యూని యన్‌ జిల్లా కోశాధికారి ప్రసన్న అన్నారు. దీంతో వారిపై పని ఒత్తిడి అధికమైందని, రూ.11,500 వేతనంతో ప్రస్తుత నిత్యావసరాల ధరలతో పోల్చి అంగన్వాడీలు ఎలా బ్రత కాలో ప్రభుత్వమే సమాధానం చెప్పాలని అన్నారు. ఎన్ని ఒత్తిడులకు గురి చేసినా సమ్మెకు దిగడ ఖాయమని స్పష్టం చేశారు. డిమాండ్లు నెరవేర్చండిఅంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చా లని నరస రావుపేట ప్రాజెక్టు కార్యదర్శి నిర్మల ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వేత నాలు తక్కువ అయినప్పటికీ కష్టపడి అంగన్వాడీ విధులు నిర్వ ర్తిస్తున్నారని,. చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సమస్య వలన ప్రభుత్వం ఇచ్చిన సెల్‌ ఫోన్‌ సక్రమంగా పని చేయడం లేదని అన్నారు. అన్ని హామీ లను, కనీస వేతనాలు అమలు చేయా లనేది తమ ప్రధాన డిమాండ్‌ అన్నారు. యాప్‌లతో పని ఒత్తిడి పెరిగింది గత ప్రభుత్వ హయాంలో ఒక యాప్‌ ఉండేదని, ప్రస్తు తం రాష్ట్రానికి సంబం ధించి వైఎస్సార్‌, కేంద్రా నికి సంబంధించి పోషణ ట్రాకర్‌ యాప్‌ లను ప్రవేశపెట్టారని నరసరావుపేట ప్రాజెక్ట్‌ లీడర్‌ మాధవి అన్నారు. హాజరు , మరుగుదొడ్లు, గృహ సందర్శన వంటి కార్యక్రమాలను యాప్‌లో నిక్షిప్తం చేయాలని, ప్రతి నెలా లబ్ధిదారుల ముఖ చిత్రాలు, పోషకాహార నిల్వలు, చిన్నారుల ఎత్తు, బరువు,ఇతర సామాగ్రి వివరాలు అందులో పొందుపరచాలని అన్నారు. గ్రామీణ ప్రాంత కేంద్రాల వద్ద సర్వర్లు సక్రమంగా పనిచేయక ఆయా వివరాలను నమోదు చేయడం సవాలుగా మారు తోందని, పని ఒత్తిడి పెరుగుతోదని అన్నారు. ఆయా యాప్‌లను కుదించి ఒక యాప్‌ తో సరిపెట్టాలని కోరారు.

➡️