న్యూయార్క్ : దిగ్గజ టెక్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్)కు అమెరికన్ కోర్టులు వరుస షాక్‌లు ఇస్తున్నాయి. అక్కడి చట్టాలను అతిక్రమించడంతో తాజాగా అమెరికా డల్లాస్ కోర్టు 210 మిలియన్లను స్థానిక సంస్థ డిఎక్స్‌సి టెక్నాలజీకి వెంటనే చెల్లించాలని ఆదేశించింది. వారం క్రితం మరో కేసులో ఎపిక్ సిస్టమ్‌కు 140 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించాలని అమెరికా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారం వ్యవధిలోనే ఈ రెండు తీర్పులు టిసిఎస్‌ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. టిసిఎస్ అమెరికా చట్టాలను అతిక్రమించి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుందని.. మేధో సంపత్తిని తస్కరించడం, చేసుకున్న ఒప్పందాలను మధ్యలోనే రద్దు చేసుకోవడం తదితర నిబంధనలు అతిక్రమిస్తుందని టిసిఎస్‌తో ఒప్పందం చేసుకున్న అక్కడి సంస్థల ప్రధాన అరోపణ.