లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..

Nov 21,2023 17:53 #Business

హైదరాబాద్‌ : దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన ట్రేడింగ్‌ చివరి వరకు అదే ఊపును కొనసాగించింది. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 276 పాయింట్లు లాభపడి 65,931కి చేరుకుంది. నిఫ్టీ 89 పాయింట్లు పుంజుకుని 19,783కి పెరిగింది.

➡️