ప్రజాశక్తి-రాంబిల్లి
కేంద్రంలోని మోడీ ప్రభుత్వ, కార్మిక, కర్షక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిలభారత కార్మిక, రైతు సంఘాల పిలుపు మేరకు ఈ నెల 27, 28 తేదీల్లో విజయవాడలో జరుగు మహాధర్నాకు తరలిరావాలని కోరుతూ శుక్రవారం పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. రాంబిల్లి మండలంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు. జి.దేముడు నాయుడు, ఆటో కార్మికులు, స్కీమ్ వర్కర్సు కరపత్ర ప్రచారం చేశారు. ఈ సందర్భంగా దేముడునాయుడు మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం 8 గంటలు పని విధానాన్ని 12 గంటలకు పెంచేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు శేషు, అప్పారావు, ఎండిఎం నాయకులు మూర్తి, రామలక్ష్మి, శానిటేషన్ వర్కర్లు ఎం.దేవి, రాజేశ్వరి, కార్మికులు పాల్గొన్నారు.కశింకోట : ప్రజా సంఘాలు, స్కీమ్ వర్కర్లతో కశింకోటలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. సిఐటియు జిల్లా నాయకులు దాకారపు శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, మహిళలకు రక్షణ కల్పించాలని, కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు తనూజ, శ్యామల, ఎపిఎస్ఇబి యూనియన్ నాయకులు శ్రీనివాసరావు, ఐద్వా జిల్లా నాయకులు డిడి.వరలక్ష్మి, మిడ్డేమీల్స్ యూనియన్ నాయకులు శ్రీదేవి, సత్యవతి, మహాలక్ష్మి, ముఠా యూనియన్ నాయకులు నూకరాజు పాల్గొన్నారు.పోస్టర్ ఆవిష్కరణచోడవరం : విజయవాడ మహాధర్నాకు సంబంధించిన వాల్ పోస్టర్ను శుక్రవారం చోడవరంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జి.వరలక్ష్మి మాట్లాడుతూ రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని, విశాఖ స్టీల్ ప్లాంట్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. విజయవాడ మహాధర్నాలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ జిల్లా నాయకులు కె.వరలక్ష్మి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్వి.నాయుడు, మిడ్డేమీల్స్ కార్మికులు ఎస్కె అమీనా, నారాయణమ్మ, స్కూల్ కార్మికులు దేవి, లక్ష్మి పాల్గొన్నారు.నర్సీపట్నం టౌన్ : ఈ నెల 27, 28 తేదీల్లో విజయవాడలో జరుగు మహాధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు కోరారు. శుక్రవారం నర్సీపట్నం కృష్ణాబజారు సెంటర్లో మహపడవ్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అడిగర్ల రాజు మాట్లాడుతూ కార్మిక, రైతు సంఘాల అద్వర్యంలో విజయవాడలో జరుగు మహపడవ్కు నర్సీపట్నం కార్మిక, రైతాంగం తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. బిజెపి ప్రభుత్వం పాలనలో దేశం అబివృద్ధి తిరోగామం పడుతుందన్నారు. దేశ సంపద కార్పొరేట్ల పాలవుతుందన్నారు. సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు బిజెపి హమీ ప్రకటనకే పరిమితమైందన్నారు. కార్మిక, రైతాంగం సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న మహపడవ్ను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ముఠా కార్మిక సంఘం నాయకులు ఎం.రమణ, అప్పలనాయుడు పాల్గొన్నారు.