ఫొటో : రైతులతో మాట్లాడుతున్న ఆర్‌డిఒ మధులత
రైతుల వద్ద నుండి ధృవపత్రాలు స్వీకరణ
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలో జాతీయ రహదారి నాలుగు లైన్లు నిర్మాణం కోసం పడమటినాయుడుపల్లి, రాజుపాలెం, చుంచులూరు గ్రామాల రైతుల భూమిని భూసేకరణ చట్టం కింద ఆత్మకూరు ఆర్‌డిఒ మధులత ఇటీవల నోటీసులు అందజేశారు. అందులో భాగంగా శుక్రవారం ఆమె తహశీల్దార్ కార్యాలయంలో ఆయా గ్రామాల్లో భూములు కోల్పోతున్న రైతుల వద్ద నుండి భూములకు సంబంధించిన డీ ఫారాలు, పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్స్ సేకరించారు. పరిహారం ఎంత చెల్లించాలనే విషయమై రైతులను అడుగగా ఎకరానికి రూ.10లక్షలు చెల్లించాలని రైతులు కోరారు. ప్రభుత్వ మార్కెట్ ధర ప్రకారం చెల్లిస్తామని ఆర్‌డిఒ చెప్పగా ప్రస్తుతం ప్రయివేట్ వ్యక్తులు అధిక ధరలు పెట్టి భూములు కొనుగోలు చేస్తున్నారన్నారు. ఈ విషయమై ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. ఆమెవెంట తహశీల్దార్ ఆనంద్ రావు ఉన్నారు.