ప్రజాశక్తి-మదనపల్లె పదవ తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పిఇటి గోపీనాథ్‌ను సస్పెండ్ చేసినట్లు డిఇఒ పురుషోత్తం తెలిపారు. శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ సంఘటనపై బాధిత విద్యార్థినిని, తల్లిదం డ్రులను విచారించారు. పిఇటి అసభ్య ప్రవర్థన నిజమని తేలడంతో సస్పెండ్ చేసినట్లు చెప్పారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పార Äశాల ప్రధానోపాధ్యాయులు సుబ్బారెడ్డి ఫిర్యాదుతో విచారణకు వచ్చానన్నారు. పాఠశాలలో ఇలాంటివి పునరావతం కాకుండా ఉపాధ్యాయులు చూడాలని తెలి పారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారి శాఖా పరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇదే పాఠశాలలో గతవారం మరొక విద్యార్థిని పట్ల మరో ఉపాధ్యాయుడు సైతం అసభ్యంగా ప్రవర్తించారని విలేకరులు డిఇఒను అడుగగా తన దష్టికి రాలేదని తెలిపారు. సమావేశంలో హెచ్ఎం సుబ్బారెడ్డి, ఎంఇఒలు రాజగోపాల్, కరుణాకర్ పాల్గొన్నారు.పిఇటిపై దిశ చట్టం కేసు నమోదు చేయాలి : సిపిఎం పదవ తరగతి విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించిన పిఇటిపై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఆటపాటలతో పాటు క్రమశిక్షణ నేర్పించాల్సిన గురువులు వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. పాఠశాలకు మంచి చరిత్ర ఉన్నదని, అలాంటి పాఠశాలలో విద్యార్తినిపై లైంగిక వేధింపులకు పాల్పడడం హేయమైన చర్యగా ఖండించారు. వేధింపులకు పాల్ప డిన పిఇటి గోపీనాథ్‌పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పిఇటి గోపీనాథ్ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విషయంపై కలకడ మండలంలో గతంలో సస్పెండ్ అయ్యారన్నారు. ఆయన పనిచేసిన ప్రతి పాఠశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వివరించారు. విద్యార్థినుల పట్ల తన ప్రవర్తన మార్చుకోని ఉన్మాది పిఇటి గోపీనాథ్ అని పేర్కొన్నారు. ఇతనిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. ఉన్నతాధికారుల వెంటనే స్పందించి శాఖపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.