‘పెండింగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి’

ప్రజాశక్తి-రాయచోటి ఓటరు జాబితాకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌మీనా అన్నారు. శుక్రవారం విజయవాడలోని ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి ఓటర్ల నమోదు, ముసాయిదా జాబితాలో ఓటర్ల చేర్పులు, తొలగింపులు, సవరణలు, రాజకీయ పార్టీల ఫిర్యాదులు, ఎపిక్‌ కార్డుల ప్రింటింగ్‌, పంపిణీ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో విసి ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్‌లోని మినీ విసి హాలు నుంచి కలెక్టర్‌ గిరీష, కెఆర్‌ఆర్‌సి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శ్రీలేఖ, డిఆర్‌ఒ సత్యనారాయణ, ఎన్నికల విభాగం డిప్యూటీ తహశీల్దార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ జెండర్‌ రేషియో, జంక్‌ క్యారెక్టర్స్‌, 10 కంటే ఎక్కువ ఓట్లు వుండి పెండింగ్‌లో ఉన్న వాటికి సంబంధించి ఇంటింటి సర్వేలో పూర్తి స్థాయి విచారణ చేపట్టి ఓటర్ల జాబితా సవరించాలన్నారు. 18 ఏళ్లు పూర్తయిన వారందరికీ ఓటు హక్కు కల్పించే విధంగా ఆయా జిల్లాలలోని అన్ని కళాశాలలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలన్నారు. తహశీల్దారులు, బిఎల్‌ఒలు ఓటు హక్కు గురించి, ఓటు యొక్క ప్రాధాన్యత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి అర్హులందరిని ఎన్రోల్మెంట్‌ చేయించాలన్నారు.ముసాయిదా ఓటర్ల జాబితాలో ఒకే రకమైన ఫోటోలు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మారిపోయినవి, మ తులు, ఒక ఇంటి నెంబర్‌ పై 10 కంటే ఎక్కువ ఓట్లు, ఒకే వ్యక్తి పేరున రెండు మూడు అంతకన్నా ఎక్కువ ఓట్లు ఉండడం లాంటి సిమిలర్‌ ఓట్ల తొలగింపునకు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు బాధ్యతాయుతంగా కషి చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గిరీష మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విధివిధానాల మేరకు జిల్లాలో అన్ని కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తున్నామని మీనాకు వివరించారు. జిల్లాలో డూప్లికెట్‌ ఓటర్లు, ఇతర ప్రదేశాలకు వలసపోయిన వారు, మరణించిన వారు, కొత్తగా వివాహమై వేరే ఊళ్లకు వెళ్లిన వారు, పునరావతమైన పేర్లు వంటి తొలగింపుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఫారమ్‌ 6 ఫారమ్‌-7, ఫారమ్‌-8ల పెండిన్సిలు, అన్‌ ప్రాసెస్డ్‌ అప్లికేషన్లను ఎప్పటికప్పుడు పూర్తి చేసి అప్డేట్‌ చేయడం జరుగుతుందన్నారు. ఫిర్యాదులు వచ్చిన అప్లికేషన్లపై ప్రత్యేక దష్టి సారించి పరిష్కరిస్తున్నామని తెలిపారు. ముసాయిదా జాబితాలో ఓటర్ల చేర్పులు, తొలగింపులను సూక్ష్మ దష్టితో పరిశీలించి ఓటర్ల సవరణ జాబితాను రూపొందిస్తున్నామన్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల స్థితి, ఓటర్ల జనాభా నిష్పత్తి, లింగ నిష్పత్తి,రాజకీయ పార్టీల ఫిర్యాదులు, ఎపిక్‌ కార్డుల ప్రింటింగ్‌ వంటి అంశాలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో యువ ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్‌ కార్యక్రమాలు నిర్వహించి 18-19 ఏళ్లు ఉన్న వారందరి ఓటరుగా నమోదు చేయించుకున్నారన్నారు. జిల్లాలోని ఎన్నికల నిర్వహణ అధికారులు వారికి అప్పగించిన బాధ్యతలను విధులను సక్రమంగా నిర్వర్తిస్తే రాబోవు ఎన్నికలను సమర్థవంతంగా ప్రశాంతంగా నిర్వహించుకోవచ్చునని పేర్కొన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి వచ్చే సాధారణ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కషి చేయాలని కలెక్టర్‌ వారికి సూచించారు.

➡️