ఉప సర్పంచి సునీత సాల్మన్ రాజు
ప్రజాశక్తి – పాలకోడేరు
వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాలుగున్నరేళ్లలో గరగపర్రు గ్రామానికి రూ.38 కోట్లు సంక్షేమ లబ్ధి చేకూరిందని పంచాయతీ ఉప సర్పంచి తోకల సునీత సాల్మన్‌రాజు అన్నారు. గరగపర్రులో శుక్రవారం రాష్ట్రానికి జగన్ ఎందుకు కావాలి కార్యక్రమాన్ని ఉప సర్పంచి సునీత సాల్మన్‌రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వైసిపి జెండాను, సంక్షేమ పథకాల లబ్ధికి సంబంధించిన బోర్డును ఉప సర్పంచి సునీత సాల్మన్ రాజు ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ వైసిపికి అండగా నిలవాలని కోరారు. జెసిఎస్ మండల కన్వీనర్ పాల రాధాకృష్ణ, ఎంపిటిసి షేక్ పాప సాహెబ్ మాట్లాడుతూ గతంలో జరిగిన సంక్షేమ లబ్ధిని ప్రస్తుత వైసిపి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలను ఒకసారి పరిశీలించుకుని ఏ ప్రభుత్వం ఎక్కువగా ప్రజలకు మంచి చేసిందో గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తమ్మిశెట్టి చిన్నబ్బులు, చింతలపాటి సూర్యనారాయణ రాజు, చింతలపాటి బలరామరాజు, తోకల సాల్మన్‌రాజు, పిలిప్, డొల్లా యోనా, వత్సవాయి రామరాజు, కశ్య ప్రసాద్ పాల్గొన్నారు.