చూసి అడు’గొయ్యి’..!

ప్రజాశక్తి – మొగల్తూరు

మండలంలోని పలు గ్రామాల్లో రహదారులు ధ్వంసమయ్యాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో వర్షం పడితే ఆ గుంతల్లో నీరు నిలిచిపోయి మడుగులను తలపిస్తున్నాయి.గ్రామాలు, మండలాల మధ్య ఉన్న అనుసంధాన మార్గాలు ధ్వంసం కావడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మండలంలోని కాళీపట్నం నుంచి జిల్లా కేంద్రం భీమవరం, మొగల్తూరు నుంచి కొత్తపాలెం, వెంప మీదుగా భీమవరం ఏళ్లే రహదారిదీ అదే పరిస్థితి. దీంతో నిత్యం వివిధ పనులపై జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు అసౌకర్యానికి గురవుతున్నారు.గ్రామాల మధ్య..మొగల్తూరు నుంచి శేరేపాలెం మీదుగా నరసాపురం గ్రామీణ మండలం కొప్పర్రు వరకూ ఉన్న పంచాయతీరాజ్‌ శాఖ రహదారి, పేరుపాలెం తూర్పుతాళ్లు, వారుతిప్ప – వెంప, కొత్తట – కోమటితిప్ప, కాళీపట్నం పాతపాడు గ్రామాల మధ్య ఉన్న ఆర్‌అండ్‌బి రహదారులు ధ్వంసమయ్యాయి. మొగల్తూరు కొత్తపాలెం, కాళీపట్నం, పాతపాడు గ్రామాల మధ్య రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో గుత్తేదారులు వాటి నిర్మాణానికి ముందుకు రావడం లేదు.రహదారుల నిర్మాణానికి చర్యలుకిరణ్‌, డిఇ, ఆర్‌అండ్‌బిశాఖ, నరసాపురంరహదారుల నిర్మాణం, మరమ్మతులకు తగు చర్యలు చేపడతాం. రూ.12 కోట్లతో చేపట్టిన కాళీపట్నం పాతపాడు రహదారి నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. పేరుపాలెం, తూర్పుతాళ్లు రహదారి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. త్వరలో పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తాను.పాలకొల్లు రూరల్‌ : లంకలకోడేరు నుంచి వెలివల వెళ్లే రహదారి అధ్వానంగా తయారైంది. ఈ రహదారి గుండా వెలివెల గ్రామస్తులు నిత్యం పాలకొల్లుకు రాకపోకలు సాగిస్తుంటారు. విద్యార్థులు, ఉద్యోగ రీత్యా పాలకొల్లుకు వెళ్లేవారు ఈ రోడ్డు గుండా ప్రయాణమంటేనే హడలిపోతున్నారు. పలు ఆరోగ్య సమస్యలకు గురువుతున్నామని ఆవేదన చెందుతున్నారు. గోతుల వల్ల వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని తెలిపారు. దీనికితోడు వెన్ను నొప్పి, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి రోడ్డును నిర్మించాలని వెలివెల గ్రామస్తులు కోఉతున్నారు.

➡️