ప్రజాశక్తి-శ్రీ సత్యసాయి: అద్దె చెల్లించలేదని బాధితుడు నాగరాజు హిందూపురం మున్సిపల్ పరిధిలోని నాల్గవ వార్డు సచివాలయానికి తాళాలు వేశాడు.
ఏడు నెలలుగా సచివాలయానికి అద్దె చెల్లించకుండా తిప్పుకుంటున్నారని యజమాని నాగరాజు తాళాలు వేసి నిరసన తెలిపారు. అద్దె ఇవ్వాలని పలుమార్లు తిరిగిన ప్రయోజనం లేకపోయిందని యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. అద్దె చెల్లించి గదిని ఖాళీ చేయాలని బాధితుడు నాగరాజు సచివాలయం ముందు నిరసన తెలిపారు.