వైయస్సార్ బీమా సాయం పంపిణీప్రజాశక్తి -ఏర్పేడు: ఏర్పేడు మండలం ఎండి పుత్తూరు గ్రామానికి చెందిన పి బత్తయ్య రెండు రోజుల క్రితం అనారోగ్యం తో హఠాత్తుగా మరణిం చారు. ఈ విషయాన్ని సర్పంచ్ దష్టికి తీసుకు వెళ్లగా సర్పంచ్ మోహన్ ప్రియ స్పందించి వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా వైయస్సార్ బీమాకు దరఖాస్తు చేయగా జగనన్న ప్రభుత్వం తక్షణ సాయం కింద 10వేల రూపాయలు మంజూరు చేశారు. ఈ మొత్తా న్ని సర్పంచ్ మోహన్ ప్రియ, ,సచివాలయం సిబ్బంది కలసి బత్త య్య కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి లోక మని, వెల్ఫేర్ అసిస్టెంట్ విష్ణు ప్రియ, వాలంటీర్ రవి పాల్గొన్నారు. ఏర్పేడు : మండలంలోని యండి పుత్తూరు గ్రామ హరిజనవాడకు చెందిన తాతి సుబ్బరామయ్య గుండెపోటుతో మతి చెందారు. ఈ విషయంను సర్పంచ్ మోహన ప్రియ యంఎల్ఏ కార్యాలయానికి మండల ఇంచార్జి కిషోర్ కుమార్ రెడ్డి ద్వారా తెలిపారు. వెంటనే స్పందించిన ఎంఎల్ఏ మధుసూదన రెడ్డి ఆదేశాల మేరకు మండల ఇంచార్జి కిషోర్ కుమార్ రెడ్డి ద్వారా సుబ్బరామయ్య కుటుంబానికి అంత్యక్రియలకు పదివేల రూపాయులు ఆర్థిక సాయం అందించారు. వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు.