ప్రాంతీయ ఉత్పత్తులపై అవగాహన పెంచుకోవాలి

ప్రాంతీయ ఉత్పత్తులపై అవగాహన పెంచుకోవాలి

ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం

విద్యార్థులు విద్యతోపాటు, నైతిక విలువలను అలవర్చుకోవాలని నిట్‌ రిజిస్ట్రార్‌ దినేష్‌ శంకర్‌ రెడ్డి తెలిపారు. భారత ప్రభుత్వ ఆధీనంలోని మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండిస్టీ ఇటీవల ప్రారంభించిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమంలో భాగంగా నిట్‌ విద్యార్థులు గూడెం చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాల విద్యార్థులకు మత్స్య సంపద, ఆహార ఉత్పత్తులపై అవగాహన కార్యక్రమాలు, వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఆయా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 10 మంది విద్యార్థులకు గురువారం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అనంతరం దినేష్‌ శంకర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతంగా రాణించేందుకు నాణ్యమైన విద్యతోపాటు నైతిక విలువలను చిన్నతనం నుంచే అలవర్చుకోవాలన్నారు. ప్రాంతీయ ఉత్పత్తులపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. అనంతరం విద్యార్థులకు ధ్రువపత్రాలు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీన్‌ స్టూడెంట్‌ వెల్ఫేర్‌ డాక్టర్‌ జిబి.వీరేష్‌ కుమార్‌, ఆచార్యులు డాక్టర్‌ వి.సందీప్‌, డాక్టర్‌ టి.రేష్మా పాల్గొన్నారు.

➡️