ఆడపిల్లలకు వరం కల్యాణమస్తు, షాదీతోఫా : కలెక్టర్‌

ప్రజాశక్తి – రాయచోటి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్‌ఆర్‌ కల్యా ణమస్తు, షాదీ తోఫాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ గిరీష పేర్కొన్నారు. గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫ రెన్స్‌ ద్వారా వైఎస్సార్‌ కల్యాణమస్తు, షాదీతోఫా కింద జూలై-సెప్టెంబర్‌, 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న 10,511 మంది అర్హులైన లబ్ధిదా రులకు రూ.81.64 కోట్ల ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. అన్నమయ్య జిల్లాకు సంబంధించి 342 మంది జంటలకు రూ.2.76 కోట్ల లబ్ధి చేకూరింది. కలెక్టరేట్‌లోని స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి కలెక్టర్‌ గిరీష, జాయిం ట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, ఉర్దూ అకాడమీ డైరెక్టర్‌ కలీం హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం పేద కుటుంబాల అభివద్ధికి నిరంతరం కషి చేస్తోందని, ప్రతి పేద కుటుంబాలలోని వధువుల తల్లిదం డ్రులను ఆర్థికంగా ఆదుకోవడం కోసం వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు, షాదితోఫా వంటి పథకాలను ప్రవేశపెట్టారన్నారు. అర్హులందరికీ పారదర్శకంగా అమలు చేస్తున్న పథకాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలలోని వారందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్నమయ్య జిల్లాలోని 342 మంది అర్హులకు సంబంధించి రూ.2.76 కోట్ల మెగా చెక్కును కలెక్టర్‌ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.

➡️