శివల హైస్కూల్లో వంట సామాగ్రి పంపిణీ

Nov 23,2023 16:39 #Konaseema

ప్రజాశక్తి రామచంద్రపురం(కోనసీమ) : రాష్ట్ర ప్రభుత్వం గోరుముద్ద పధకం క్రింద మంజూరు చేసిన వంట సామాగ్రిని శివల జిల్లా పరిషత్‌ హై స్కూల్లో గురువారం పంపిణీ చేశారు. మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్‌ ఇళ్ల సూర్యనారాయణ, గ్రామ సర్పంచ్‌ అనసూరీ సాయిబాబు, ప్రధానోపాధ్యాయులు కపాలాల్‌ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఇళ్ల సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను చదువుతోపాటు ఆటల్లో రాణించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. దీంతో పాటుగా భారత క్రికెట్‌ టీం లో రిజర్వేషన్లు అమలు పరిస్థితి మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. అనంతరం శీవల ప్రాథమిక పాఠశాలలో నూ వంట సామాగ్రిని కుకింగ్‌ ఏజెన్సీకి అందజేశారు. ప్రధానోపాధ్యాయులు వివిఎస్‌ వర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

➡️