మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి

Nov 21,2023 21:58 #Sri Satya Sai District

పుట్టపర్తి అర్బన్‌ : మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగి, అన్ని రంగాల్లో రాణించాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శోభాకరం ధాలాజీ పిలుపునిచ్చారు. సత్యసాయి బాబా 98వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం నాడు ప్రశాంతి నిలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రితో పాటు హెచ్‌హెచ్‌.రాజమాత ప్రమోదా దేవి వడియార్‌ పాల్గొన్నారు. ఉదయం సత్యసాయి విద్యార్థులతో కలిసి మహిళలు పెద్ద ఎత్తున సభా వేదిక వద్దకు ర్యాలీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేంద్రమంత్రి మహిళలను ఉద్ధేవించి ప్రసంగించారు. ఈ ఏడాది మహిళా దినోత్సవానికి ప్రశాంతి నిలయానికి రావడం సంతోషంగా ఉందన్నారు. సత్యసాయి మహిళా సమానత్వం ఉండాలని కోరుకునేవారన్నారు. నేటి ఆధునిక యుగంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. భారతదేశ సాంస్కతి సాంప్రదాయాలు చాలా గొప్పవన్నారు. ప్రపంచ దేశాలు సైతం భారత సాంప్రదాయాలను ఎంతో గౌరవిస్తారని చెప్పారు. సత్యసాయి తన ఆధ్యాత్మిక బోధనలలో కూడా మహిళల పాత్ర గొప్పదని చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. మహిళలు స్వసక్తితో ఎదగాలన్నారు. మహిళా శక్తి ఏమిటో నిరూపించుకోవాలన్నారు. రాజమాత ప్రమోదా దేవి మాట్లాడుతూ, 1990లో తాను మొదటిసారిగా ప్రశాంతి నిలయాన్ని సందర్శించినట్లు చెప్పారు. సత్యసాయి మైసూర్‌ ప్యాలెస్‌కు వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. మహిళలకు ఆత్మగౌరవం నింపడానికి సత్యసాయి ట్రస్ట్‌ చేస్తున్న కషి ప్రశంసనీయమన్నారు. యూరోపియన్‌ దేశాల సలహాదారు పెట్రో కాలినో వ్యాలీ మాట్లాడుతూ సత్యసాయి అందించిన సేవలను అనుసరించి మహిళా ట్రస్టు కార్యకలాపాలలో వారి పాత్ర గొప్పదన్నారు. ఏటా మహిళా దినోత్సవం జరుపుకుంటూ మహిళా శక్తిని సమాజంలో మహిళా పాత్ర గురించి చర్చించుకోవడం మంచి సాంప్రదాయం అన్నారు. సాయంత్రం రఘునాథన్‌ బందం నిర్వహించిన కచేరి అలరించింది. సత్యసాయి విద్యార్థులు నిర్వహించిన నాటికలు ఆకట్టుకున్నాయి.

➡️