విశాఖ బోటు ప్రమాద బాధితులకు పరిహారం చెల్లింపు

Nov 23,2023 13:08 #Visakha

ప్రజాశక్తి-ఎంవిపీ కాలనీ : విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ అగ్ని ప్రమాదంలో దెబ్బతిన్న ఫిషింగ్‌ బోట్ల యజమానులకు ప్రభుత్వం నష్టపరిహారం పంపిణీ చేసింది. ఈ ప్రమాదంలో అగ్నికి ఆహుతైన 49 బోట్లకు గాను రూ.7.11 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరిహారాన్ని మంత్రులు సీదిరి అప్పలరాజు,గుడివాడ అమర్నాథ్‌,రీజినల్‌ కో ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పూర్తిగా కాలిపోయిన 30 బోట్లకు 80 శాతం పరిహారంలో భాగంగా రూ.6,44,80,000, పాక్షికంగా దగ్ధమైన 18 బోట్లు, ఒక వలకు రూ.66.96 లక్షలు పరిహారాన్ని అందించినట్లు మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. బోట్లు దగ్ధమవడంతో వాటిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న హమాలీలు, చిరువ్యాపారులను కూడా ప్రభుత్వం గుర్తించిందని… ఒక్కో బోటుకు 10మంది చొప్పున పరిగణనలోకి తీసుకుని మొత్తం 490 మందికి ఒక్కొక్కరికీ వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద రూ.10వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు.

➡️