ప్రజాశక్తి – నందిగామ : ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ మ్యాచ్ క్రికెట్ అభిమానుల కోసం నందిగామ జడ్పీ పాఠశాలలో ఆదివారం భారీ ఎల్.ఈ.డి స్క్రీన్ నందిగామ ఎంఎల్‌ఎ మొండితోక జగన్ మోహన్‌రావు ఏర్పాటు చేశారు. ఎల్.ఈ.డి స్క్రీన్‌లో లైవ్ క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారీ ఎత్తున క్రికెట్ అభిమానులు, విద్యార్థులు తరలివచ్చారు. ఇండియా జట్టు వరల్డ్ కప్ సాధించాలని, భారతీయ ఖ్యాతిని ప్రపంచానికి చాటేలా ఫైనల్ మ్యాచ్ గెలవాలని ఎంఎల్‌ఎ కోరుకుంటున్నానన్నారు. స్క్రీన్ల ఏర్పాటుపై అభిమానులు కృతజ్ఞతలు తెలిపారు.
టీమ్ ఇండియా గెలుపుకోసం జాతీయ పతాకంతో ప్రదర్శన
ప్రజాశక్తి – వన్‌టౌన్ : వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లో ఇండియా గెలుపును కాంక్షిస్తూ ”కమాన్ ఇండియా’ అంటూ ఎఐఎస్‌ఎఫ్, ఎఐవైఎఫ్ ఆధ్వర్యంలో భారీ జాతీయ పతాకంతో ఆదివారం ప్రదర్శన నిర్వహించారు. కేబీఎన్ కాలేజీ వద్ద నుండి నెహ్రూ బొమ్మ సెంటర్ మీదగా చిట్టినగర్ నుండి తిరిగి కేబీఎన్ కాలేజీ వరకు ప్రదర్శన సాగింది. ప్రదర్శనలో ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, నగర నాయకులు సాయి కుమార్, అయ్యప్ప, చందు, ఎఐవైఎఫ్ నగర అధ్యక్ష, కార్యదర్శులు కంచర్ల భార్గవ్, లంకా గోవింద రాజులు, ఎస్. మోహన్ కుమార్ పాల్గొన్నారు.
ఇండియా గెలుపును కాంక్షిస్తూ నమూనా కప్‌తో ర్యాలీ…
టీమ్ ఇండియా విజయాన్ని కాంక్షిస్తూ చార్టెడ్ అకౌంట్ ముదిలి విజయకష్ణ అండ్ కో వారి ఆధ్వర్యంలో ప్రపంచ కప్ నమూనాతో వన్‌టౌన్ రాయల్ హాోటల్ సెంటర్ నుంచి కాళేశ్వరరావు మార్కెట్ మీదగా చిట్టినగర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ స్టాండింగ్ కమిటీ సభ్యులు, 51వ డివిజన్ కార్పొరేటర్ మరుపిళ్ళ రాజేష్ హాజరై ర్యాలీ ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ యావత్ భారతదేశం ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న సమయం భారత్ మూడో వరల్డ్ కప్‌ను తేవాలని కోరుకుంటూ ఈ ర్యాలీ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చార్టెడ్ అకౌంట్ ముదిలి విజరు కష్ణ, ముదిలి నగేష్, బాయన వరప్రసాద్, గురుమహంతు శివాజి ఇతర సభ్యులు పాల్గొన్నారు.