సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్లు : ఎంపిపి

Nov 21,2023 22:03 #West Godavari District

పాలకోడేరు : సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్లని ఎంపిపి భూపతి రాజు సత్యనారాయణరాజు (చంటిరాజు) అన్నారు. విస్సాకోడేరులో రాష్ట్రానికి జగన్‌ ఎందుకు కావాలి కార్యక్రమాన్ని సర్పంచి బొల్ల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసిపి జెండాను మండల కన్వీనర్‌ కటిక శ్రీదేవి ఆవిష్కరించారు. సంక్షేమ బోర్డును ఎంపిపి చంటిరాజు ఆవిష్కరించారు. ఈ సభకు సర్పంచి శ్రీనివాస్‌ అధ్యక్షత వహించి మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచి నాగరాజు, ఎంపిటిసిలు బి.గాందీ పాల్గొన్నారు.

➡️