35 ఎకరాల్లో గంజాయి తోటల ధ్వంసం

గంజాయి తోటల ధ్వంసం

ప్రజాశక్తి- ముంచింగిపుట్టు: ఆంధ్రాఒడిశా సరిహద్దు ప్రాంతంలో గ్రేహౌండ్స్‌ పోలీసుల సహకారంతో బుధవారం భారీగా గంజాయి తోటలను ధ్వంసం చేసినట్లు ఎస్‌ఐ కె.రవీంద్ర తెలిపారు. విలేకరులకు తెలిపిన వివరాలివి. మండలంలోని లక్ష్మిపురం, బుంగాపుట్‌, బరడ, బాబుసాల, రంగబయలు పంచాయతీలకు చెందిన గడ్డిబంద, తుమ్మిడిపుట్టు, సంగంవలస, కొసొంపుట్టు, గునసెల్మ, బొడ్డపుట్‌, బరడ, దాబుగూడ, కర్లపొదోరు, డెంగచెమిలి, డెంగము, మొంజగూడ, అర్లోయిపుట్‌, జడిగూడ తదితర గ్రామాల్లో సాగు చేస్తున్న 35 ఎకరాల్లో గంజాయి మొక్కలను గుర్తించిన తర్వాత గ్రేహౌండ్స్‌ పోలీసుల సహకారంతో స్థానిక ఎస్‌ఐ రవీంద్రతో పాటు పోలీసులు కొన్ని కిలోమీటర్ల మేర అటవీ మార్గల్లో నడిచి వెళ్లి, గంజాయి మొక్కలను నరికి వేశారు, నరికిన గంజాయి మొక్కలు ఒకచోట పోగు చేసి నిప్పంటించి తగలబెట్టారు. కేసుల నమోదుకు పాడేరు ఎస్‌ఇబి పోలీసులకు తెలిపినట్లు ఎస్సై తెలిపారు. గంజాయి సాగు, రవాణా చట్టప్రకారం నేరమని, పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దాడుల్లో స్థానిక పోలీసులు,గ్రేహౌండ్స్‌ పోలీసులు పాల్గొన్నారు.

గంజాయి తోటలను ధ్వంసం చేస్తున్న ఎస్‌ఇబి, స్థానిక పోలీసులు

➡️