హనుమంతువాక కూడలిలో మొక్కల నాటివేత

మొక్కలు నాటుతున్న పిఎంఒ అదనపు కార్యదర్శి అతీష్‌ చంద్ర

ప్రజాశక్తి – ఆరిలోవ : విశాఖ నగరాన్ని పర్యావరణంతో కూడిన పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో గ్రీన్‌ మై స్ట్రీట్‌ అనే నినాదంతో హనుమంతువాక కూడలి వద్ద గల పార్కులో బుధవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి కార్యాలయం అదనపు కార్యదర్శి అతీష్‌చంద్ర, జివిఎంసి మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి, జివిఎంసి కమిషనర్‌ సిఎం.సాయికాంత్‌వర్మ, హౌసింగ్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ లకీëషా, వార్డు కార్పొరేటర్‌ కోరుకొండ స్వాతీదాస్‌ హాజరై పలు రకాల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ, నగరంలోని పలు కూడళ్లు, రహదారులకు ఇరువైపులా సుమారు 10 వేల మొక్కలను నాటేందుకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌, హార్టీకల్చర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఎం.దామోదర్‌రావు, జోనల్‌ కమిషనర్‌ కనకమహాలకీë, వైసిపి నాయకులు ఉమ్మడి దాసు తదితరులు పాల్గొన్నారు.మొక్కలు నాటుతున్న పిఎంఒ అదనపు కార్యదర్శి అతీష్‌ చంద్ర

➡️