ప్రజాశక్తి-అమలాపురం
అల్లవరం మండల తహశీల్దార్ కార్యాల యంలో గ్రామ పరిధిలో 119 మంది లంక భూములు సాగు చేసు కుంటున్న వారికి అయిదేళ్ల సాగు పరిమితి గల లీజుపట్టాలు 35 ఎకరాలు విస్తీర్థాణనిరి సంబంధించి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఎంపీ చింతా అనురాధ పంపిణీ చేశారు. బోడసకుర్రు గ్రామం నందు పలు అభివృద్ధి కార్యక్రమా లను మంత్రి పినిపే విశ్వరూప్ ప్రారంభించారు బుధవారం బోడసకుర్రు గ్రామంలో ఎంపీ లార్డ్స్ నిధులైన రూ.10 లక్షలతో నిర్మించిన సిమెంట్ కాంక్రీట్ రోడ్లను ఆయన ప్రారంభించారు అనంతరం ఒఎన్జిసి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులైన రూ.28.24 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన ఓవర్హెడ్ ట్యాంకును మంత్రి ప్రారంభించారు. తదుపరి వేదాంత లిమిటెడ్ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులైన రూ.10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను మంత్రి ప్రారంభించారు. అల్లవరం మండల తహశీల్దార్ కార్యాలయంలో గ్రామ పరిధిలో 119 మంది లంక భూములు సాగు చేసు కుంటున్న వారికి ఐదు సంవత్సరాల సాగు పరిమితి గల లీజుపట్టాలు 35 ఎకరాలు విస్తీర్ణం కు సంబంధించి మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి లంక భూములు లీజుదారుల ఇబ్బందులను పరిగణన లో తీసుకొని అయిదేళ్ల కు లీజు ప్రాతిపదికన ఆయా భూము లపై అన్ని రకాల హక్కులు ఉండే విధంగా పట్టాలు జారీ చేయడం సంతోషదాయకమని అన్నారు. లంక భూములపై సాగుదారులకు అందరు రైతులు మాదిరిగానే రుణ పరపతి సౌలభ్యం ఉంటుందన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతు భరోసా నిధులు కూడా అందుతాయన్నారు. స్థానిక ఎంపీ చింతా అనురాధ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ప్రతి కుటుంబం మేలుకోరి పలు పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చి ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుందన్నారు. అసైన్ భూములు లంక భూములు పై సర్వ హక్కులు కల్పించడం హర్షణీయమని తెలిపారు. అన్ని రంగాల సర్వతోముఖాభివద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతను అందించి భరోసాగా నిలుస్తుందన్నారు. ఎంఎల్‌ఇస బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి ఆయా రంగాల్లో అభివద్ధికి ఎంతగానో పాటుపడుతుందన్నారు. సామాజిక న్యాయం, ఆర్థిక సాయం వంటి అంశాలలో పురోగతి సాధించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఐ.శేషగిరి రావు, జెడ్‌పిటిసి సభ్యురాలు కె.గౌతమి, సర్పంచ్ ఆర్.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.పట్టాలు అందజేస్తున్న మంత్రి పినిపే విశ్వరూప్, ఎంపీ చింతా అనురాధ