ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : వచ్చే ఏడాది 2024లో జరగనున్న లోక్ సభ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికలలో వివిధ అంశాలలో సమర్థవంతంగా ఎన్నికల విధుల పర్యవేక్షణకు 16 మంది నోడల్ అధికారులను నియమిస్తూ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఉత్తర్వులు జారీ చేశారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మంగళవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమాలు(స్వీప్) నిర్వహణకు నోడల్ అధికారిగా జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, వారికి సహాయకులుగా, ఈఆర్వోలు, ఏఈఆర్వోల సమన్వయ విధులు జిల్లా సహకార శాఖ అధికారి వివి ఫణికుమార్, జిల్లా వృత్తి విద్యాధికారి బి ఎస్ ఆర్ వి ప్రసాద్ నిర్వహించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శాంతిభద్రతలు, నిఘా పర్యవేక్షణ, భద్రతా ప్రణాళిక నోడల్ అధికారిగా జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, వారికి సమన్వయ అధికారులుగా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఏ శ్రీధర్, అదనపు పోలీసు అధికారి ఆర్ శ్రీహరిబాబులను నియమించారు. ఓటర్ల జాబితా తయారీ ఈఆర్ఓ లతో సమన్వయ నోడల్ అధికారిగా డి ఆర్ ఓ పెద్ది రోజాను, మాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిగా జెడ్పీ ఉప ముఖ్యకార్య నిర్వహణ అధికారి ఏ శ్రీనివాసరావు,, వారికి సమన్వయ అధికారులుగా జిల్లా ఖజానా లెక్కల అధికారి ఎస్ రవికుమార్, ఎన్ఐసి జిల్లా ఇన్ఫర్మేటిక్స్ అధికారి ఫణి కృష్ణను నియమించారు. పోలింగ్ అధికారులు సిబ్బందికి శిక్షణ నిచ్చే నోడల్ అధికారిగా డిఆర్డిఏ పిడి పిఎస్ఆర్ ప్రసాద్, పోలింగ్ సామాగ్రి నిర్వహణకు మూడవ అధికారిగా జిల్లా పరిశ్రమల అధికారి ఆర్. వెంకట్రావు,రవాణా నిర్వహణ నోడల్ అధికారిగా జిల్లా రవాణా అధికారి ఎం పురేంద్ర, జిల్లా ప్రజా రవాణా అధికారి (ఏపీఎస్ఆర్టీసీ) ఏ. వాణిశ్రీ, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ ఎన్. శ్రీనివాసరావు,కంప్యూటరైజేషన్, సైబర్ సెక్యూరిటీ, ఐటీ నిర్వహణ నోడల్ అధికారిగా జిల్లా ఇన్ఫర్మేటిక్స్ అధికారి (ఎన్ఐసి) ఫణి కృష్ణ, ఈవీఎంల నిర్వహణ మోడల్ అధికారిగా జిల్లా పంచాయతీ అధికారి ఎస్ వి నాగేశ్వర్ నాయక్, సమన్వయ అధికారిగా జిల్లా ఇన్ఫర్మేటిక్స్ అధికారి (ఎన్ ఐ సి)ఫణి కృష్ణ, ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసిసి) నోడల అధికారిగా జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి జ్యోతి బసును, ఎన్నికల వ్యయ పర్యవేక్షణకు నోడల్ అధికారులుగా జిల్లా ఆడిట్ అధికారి వై సూర్య భాస్కరరావు, జిల్లా సహకార అధికారి వివి ఫణి కుమార్, బ్యాలెట్ పేపర్, పోస్టల్ బ్యాలెట్, ఈటీపీబిఎస్ నిర్వహణ నోడల్ అధికారిగా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కె. రాములు నాయక్,మీడియా నిర్వహణకు నోడల్ అధికారిగా జిల్లా సమాచార పౌర సంబంధాధికారి ఎం.వెంకటేశ్వర ప్రసాద్,కమ్యూనికేషన్ ప్రణాళిక నిర్వహణకు జిల్లా పశుసంవర్ధక అధికారి ఏ శ్రీనివాసరావు, జిల్లా ఆర్థిక, గణాంక అధికారి ఎం జగదీష్, ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం, ఓటరు హెల్ప్ లైన్ నిర్వహణకు నోడల్ అధికారిగా జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి కె అప్పారావు, ఎన్నికల పరిశీలకుల కార్యక్రమాల సమన్వయ విధుల నోడల్ అధికారిగా డ్వామా పిడి జీవి సూర్యనారాయణ ఎన్నికల విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.