సీపీఎం నగర కార్యదర్శి డిమాండ్
25న మున్సిపల్ అఫీస్ వద్ధ ధర్నా
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : బొగ్గుల దిబ్బ దళితుల ఇళ్లు తొలగించిన చోటే ఇల్లు నిర్మించి ఇవ్వాలని సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు. బొగ్గుల దిబ్బ దళితుల ఇల్లు కూల్చేసి 10 నెలలు అయినా నేటికీ ప్రత్యామ్నాయం చూపలేదు సరికదా గుంకలాము లే అవుట్ లో ఇచ్చినవారికి ఇళ్లు నిర్మించలేదు. నేటికీ అద్దె ఇల్లులో ఉంటూన్నారు. అద్దెలు కట్టలేక నానా ఇబ్బందులూ పడుతున్నారు. బుధవారం స్థానిక ఎల్ బి జి భవనం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులకు ఇళ్లు కోసం 25 న మున్సిపల్ అఫీస్ వద్ధ ధర్నా చేస్తామని తెలిపారు. ఈ దర్నాకి పట్టణంలో ఉన్న దళితులు, దళిత సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరారు. జగనన్న ప్రభుత్వం పట్టణాల్లో, నగరాల్లో ప్రభుత్వం భూముల్లో నివాసమున్న చోటే రెగ్యుల రైజ్ చెయ్యాలనీ జీవో నెంబర్ 60 ఇచ్చిందని తెలిపారు. దీన్ని తక్షణమే అమలు చేయాలనీ కోరారు. దళితుల ఆత్మ గౌరవం కాపాడేందుకు సీపీఎం ఎప్పుడు వారికి అండగా ఉంటుందని అన్నారు. విలేకర్ల సమావేశంలో సీపీఎం జిల్లా కమిటి సభ్యులు పి.రమణమ్మ. కె వి పి ఎస్ జిల్లా కార్యదర్శి అర్. ఆనంద్.బొగ్గుల దిబ్బ బాధితురాలు ఎరుకలమ్మ పాల్గొన్నారు.