ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్: నీటిపై ఎలాంటి చలనం లేకుండా నాలుగు గంటలపాటు ఉంటూ ఇండియా బుక్ రికార్డును చిత్తూరుకు చెందిన యువకుడు విశాక్ సొంతం చేసుకున్నాడు. దేశ విదేశాల్లో తన ప్రతిభతో ఆకట్టుకున్న చిత్తూరు యువకుడు ఇండియా బుక్కులో తన పేరును నమోదు చేసుకునేందుకు బుధవారం స్థానిక డాన్స్ హోటల్ స్విమ్మింగ్ పూల్ లో నాలుగు గంటల పాటు ఎలాంటి చలనం లేకుండా నీటిపై తేలేడుతూ రికార్డు నెలకొల్పారు. ఇది అరుదైన ఘట్టంగా ఇండియా బుక్ ప్రతినిధి హరీష్ తెలిపారు. తమ కుమారుడు ఇండియా బుక్ నందు పేరు నమోదు చేసుకోవడం పట్ల యువకుడి తల్లిదండ్రులు భవాని బాబు, శోభ ఆనందం వ్యక్తం చేశారు.