తిరుపతి : తిరుపతి టిటిడి చెవిటి మూగ పాఠశాలలోని ఓ విద్యార్థికి సహ విద్యార్థులు నిప్పంటించిన ఘటన మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో జరిగింది. బదిరుల పాఠశాలలోని విద్యార్థుల మధ్య ఘర్షణ జరగడంతో … వడమాలపేట రజక కాలనీకి చెందిన దాము కుమారుడు చందుకు సహ విద్యార్థులు నిప్పంటించారు. ఈ ఘటనలో చందు శరీరం 70 శాతం కాలిపోయింది. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. తనపై కెమికల్ ఆయిల్ పోసి నిప్పు పెట్టారని బాధిత విద్యార్థి చందు రాసి చూపించారు. అయితే … హాస్టల్ వార్డెన్ సిబ్బంది దాడి చేసిన వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. తమకు న్యాయం చేయాలని బాధిత విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ లో సి.సి. పుటేజిని పరిశీలించాలని బాధితుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.