‘సోషల్ మీడియాలో నా గురించి బ్యాడ్‌గా రాసే మాటల వల్ల నా ఫ్యామిలీలో చాలామంది పక్కన పెట్టేశారు. అవన్నీ భరించలేక చనిపోదామని కూడా నిర్ణయించుకున్నా. అప్పుడు పిల్లలు గుర్తుకొచ్చి ఏమి చేసుకోలేకపోయాను’ అని కన్నీటి పర్యంతమయ్యారు నటి యమున. 1989లో విడుదలైన మౌన పోరాటం సినిమా ద్వారా ఆమెకు పేరొచ్చింది. మామగారు, పుట్టింటి పట్టుచీర, ఎర్ర మందారం వంటి చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత వివాహం కావటంతో సినిమాలకు దూరమయ్యారు. కొంత విరామం తర్వాత నుంచి టీవీ సీరియళ్లలో నటిస్తున్నారు. పన్నెండేళ్ల క్రితం ఓ కేసు తాలూకా విషయాలపై కోర్టు క్లీన్చిట్ ఇచ్చినా ఇంకా సామాజిక మాధ్యమాల్లో తనను ఇబ్బంది పెట్టేలా పోస్టులు వస్తుండటం బాధాకరమని ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.