ఫిషింగ్‌ హార్బర్‌ అగ్ని ప్రమాద బాధితులకు పవన్‌ సాయం

Nov 21,2023 14:39 #pawan kalyan, #tweets

అమరావతి: విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్నిప్రమాద బాధితులకు జనసేన అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. బోట్ల యజమానులకు రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. రెండు, మూడు రోజుల్లో తానే స్వయంగా బాధితులకు అందజేయనున్నట్లు పవన్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.
విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో ఉన్న ఓ బోటులో ఆదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా చెలరేగడంతో పక్కన ఉన్న బోట్లకు ఆ మంటలు వ్యాపించాయి. 45 బోట్లు ఆగ్నికి ఆహుతయ్యాయి. దీంతో బోట్ల యజమానులు, వాటిపై ఆధారపడ్డ మత్స్యకారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అగ్నిప్రమాద ఘటనకు దారితీసిన కారణాలను ఇంత వరకు పోలీసులు వెల్లడించలేదు.

➡️