కాకినాడ తీరంలో తిరగబడ్డ తెప్ప.. ఇద్దరు మత్స్యకారులు మృతి

Nov 21,2023 13:59 #dead, #fishermens, #Kakinada

కాకినాడ : కాకినాడ తీరంలో తెప్ప తిరగబడటంతో ఇద్దరు మత్స్యకారులు సముద్రంలో గల్లంతై మృతిచెందిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. సూర్యారావుపేట నుంచి హౌప్‌ ఐల్యాండ్‌ వరకు అయిదుగురు మత్స్యకారులు వేటకు వెళ్లారు. వేటక ముగించుకొని తిరిగి వస్తుండగా కెరటాల ధాటికి తెప్ప తిరగడింది. ఈ ఘటనలో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. మరో ఇద్దరు మత్స్యకారులు మృతి చెందారు. బాధితులు దుమ్మలపేటకు చెందిన మైలపల్లి కృపాదాస్‌, సూర్యరావుపేటకు చెందిన సత్తిరాజుగా గుర్తించారు. మృతుల కుటుంబాలకు ఎపి ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. తెప్ప తిరగబడి సముద్రంలో పడటంతో ఇద్దరు మత్స్యకారులు మృతి చెందిన విషయాన్ని కాకినాడ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ దృష్టికి తీసుకెళ్లారు. మత్స్యకారుల మృతి విషయాన్ని తెలుసుకున్న సిఎం తక్షణ సాయంగా రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.10 లక్షలు నష్టపరిహారం మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు సూచించారు.

➡️