పేదల భూములకు సర్వహక్కులు : కలెక్టర్‌

Nov 18,2023 14:21 #Annamayya district

రాయచోటి : ఎన్నోసంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోని భూములకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందని, యాజమాన్య హక్కులు కల్పించిందన్లి కలెక్టర్‌ గిరీష పేర్కొన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఏలూరు జిల్లా నూజివీడులో పేదలకు భూ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయ ఆవరణంలో నిషేధిత భూము లకు భూహక్కు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా రెవెన్యూ వ్యవస్థలో చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. భూమిలేని పేదలకు భూమిని అందిస్తూ నిషేధిత భూములపై సర్వహక్కులు కల్పించి పేద రైతుల చిరకాల భూ సమ స్యలకు పరిష్కారం చూపిందని తెలిపారు. అసైన్డ్‌ భూములు, ఇనాం భూములు, ఎస్సీ కార్పొరేషన్‌ భూములు, చుక్కల భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించి పేదల భూములకు భూహక్కుపత్రాలు పంపిణీ చేశామని పేర్కొ న్నారు. రోజురోజుకు భూముల విలువ పెరుగుతుందే తప్ప భూమి విలువ తగ్గదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. భూములకు సర్వహక్కులు కల్పించ డంతో భూములు అమ్ముకొని ఆర్థిక ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దన్నారు. భూ కబ్జాలకు తావు లేకుండా ప్రభుత్వం రీ సర్వే కార్యక్రమం ద్వారా రైతు భూమికి ఒకెఎల్‌పిఎం నెంబర్‌ కేటాయించి మీ భూములకు రక్షణ కల్పించామని పేర్కొన్నారు. జిల్లాలో 90 శాతం వరకు భూ సమస్యలు అధికంగా ఉన్నాయని వీటి పరిష్కా రానికి మండల స్థాయిలో జగనన్నకు చెబుతా స్పందన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజులలో భూ సమ స్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పారు. గతంలో శ్మశాన వాటికలు లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే వారిని నేడు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ కాలనీలలో అడిగిన వారందరికీ బరియల్‌ గ్రౌండ్‌ ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు పేదల ముంగిటకు తీసుకురావడం జరుగుతుందని అర్హులందరూ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకొని ఆర్థిక అభివద్ధి చెందాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఇది పేదలకు సంబంధించిన కార్యక్రమమన్నారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని భూములకు యాజమాన్య హక్కులు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా నిషేధిత భూములకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడం ఎంతో శుభ పరిణామమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20,24,709 మంది పేదలకు లబ్ధి చేకూరుస్తూ 35,44,866 ఎకరాలలో పేదలకు భూ పంపిణీ ఆ భూములపై సర్వహక్కులు కల్పించారని పేర్కొన్నారు. దేశంలో మొదటిసారిగా అనేక రకాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో వైయస్సార్‌ జగనన్న అశ్విత భూహక్కు, భూరక్ష కార్యక్రమం ద్వారా ఇప్పటికే రెండు విడతల్లో 4 వేల గ్రామాలలో 42.6 లక్షల ఎకరాలలో రీసర్వే పూర్తి చేసి17.53 లక్షల మంది రైతులకు భూ హక్కు పత్రాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. చట్టబద్ధత కల్పించిన పేదల భూములకు రీసర్వే చేయడం జరిగిందని రీ సర్వే చేసిన భూములు ఎవరు తీసుకునే అవకాశం లేదన్నారు. పేదలు తమ భూములను అమ్మకుండా వ్యవసాయం చేసుకొని అభివద్ధి చెందాలని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ రైతు భరోసా కూడా ఇచ్చామన్నారు. భూమి ఉన్న రైతుకు సమాజంలో గౌరవం పెరగడంతోపాటు భూమి విలువ కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. నేడు ఎక్కడ కూడా లంచాలకు తావు లేకుండా ప్రతి పథకం నేరుగా అర్హులందరికీ అందించామని తెలిపారు. ఇలాంటి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లాలో 2100 మంది లబ్ధిదారులకు గాను 3000.84 ఎకరాల నిషేధిత భూములకు సంబంధించి భూ యాజమాన్య హక్కు పత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ రంగస్వామి, మండల స్పెషల్‌ ఆఫీసర్‌ రాజశేఖర్‌రెడ్డి, తహశీల్దార్‌ ప్రేమంత్‌ కుమార్‌, రైతులు పాల్గొన్నారు.

➡️