ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ కోసమే ఉద్యమాలు

Nov 18,2023 12:52 #palanadu, #utf

పల్నాడు జిల్లా: ప్రభుత్వ విద్యారంగ రక్షణ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ పేద,బడుగు , బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే కోసమే యుటిఎఫ్‌ ఉద్యమాలు చేస్తుందని యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు పి.ప్రేమ్‌ కుమార్‌, జి.విజయ సారధి అన్నారు. ఈ మేరకు శుక్రవార పల్నాడు రోడ్డులోని మున్సిపల్‌ బాలుర హైస్కూల్లో యుటిఎఫ్‌ నరసరావుపేట మున్సిపల్‌ శాఖ, మండలం, రొంపిచర్ల, నకరికల్లు శాఖ నూతన కౌన్సిల్‌, కార్యవర్గ ఎన్నికల సమావేశం జరిగింది. ఈ సమా వేశానికి యుటిఎఫ్‌ జిల్లా సహాధ్యక్షులు ఎన్‌.మోహనరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రేమ్‌కుమార్‌ మాట్లా డుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగ బాధ్యతలు నుండి క్రమంగా తప్పు కుంటున్నాయని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన జాతీయ విద్యా విధానం పేరిట విద్యా రంగంలో కార్పొ రేటీకరణ, కాషాయీకరణ, కేంద్రీ కరణ అమలు పరుస్తున్నారన్నారు. శాస్త్రీయ విద్యా విధా నాన్ని బుట్ట దాఖలు పరుస్తూ చరిత్రను వక్రీకరిస్తూ పలు విజ్ఞాన అంశాలను పాఠ్యాంశాల నుండి తొల గించారని ఆవే దన వ్యక్తం చేశారు. ఉమ్మడి జాబితాలోని విద్యపై రాష్ట్రల హక్కులను హరిస్తూ కేంద్రం పెత్తనం వలన సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుందన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో సైతం నూతన జాతీయ విద్యా విధానం అమలుకు సాహ సించకుండా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఎర్ర తివాచీ పరిచి అమలకు పూనుకుంద న్నారు. విజయ సారథి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 117 జీఓ వలన అనేక ప్రాథమిక పాఠశాలలు కేవలం 1, 2 తరగ తులకే పరిమిత మయ్యాయని, అనేక సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయ పోస్టులు రేషనలైజేషన్‌ పేరిట రద్దు చేయడంతో ప్రాథమిక పాఠశాలలో నాణ్యమైన విద్య ఎండమావి అయిందన్నారు. సిపిఎస్‌ స్థానంలో జిపిఎస్‌ అనే మోసపూరిత గోల్‌ మాల్‌ పెన్షన్‌ స్కీమ్‌ తీసుకువచ్చి సిపిఎస్‌ ఉపా ధ్యాయుల పెన్షన్‌ విధానాన్ని గందరగోళం చేశారన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న టిఏ డిఏ పిఎఫ్‌ రుణాలు వెంటనే చెల్లిం చాలని డిమాండ్‌ చేశారు. జిల్లా గౌరవాధ్య క్షులు కె.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ యుటిఎఫ్‌ కార్యకర్తలు సామాజిక స్పహతో పని చేయాలని సమకాలీన రాజకీయ ఆర్థిక అంశాలు అధ్యయనం చేసి లోతైన అవ గాహనతో ఉపాధ్యాయులను చైతన్య పరుస్తూ సంఘాన్ని బలోపేతం చేయా లన్నారు. అనంతరం నరసరావుపేట మం డలం, పట్టణం ,నకరికల్లు, రొంపిచర్ల శాఖ లకు కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. జిల్లా సహాధ్యక్షులు ఎం.మోహన్‌ రావు, ఎ.భాగేశ్వరిదేవి, కె.ఉషా సౌరీ రాణి, టి వెంకటేశ్వర్లు, ఎన్నికలను నిర్వహించారు. రొంపిచర్ల అన్ని పోస్టులు మహిళా ఉపా ధ్యాయుణులు ఎంపికవడం విశేషమని జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలు అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్‌ ఎన్‌ సుందరరావు, జిల్లా ఆడిటర్‌ వై శ్రీని వాసరావు, సీనియర్‌ నాయకులు సుధా కర్‌రెడ్డి, శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం
యుటిఎఫ్‌ నరసరావుపేట మండల నూతన కార్యవర్గం గౌరవాద్యక్షులుగా పి.సత్యనారాయణ, అధ్యక్షులుగా బి.శ్రీనివాస కళ్యాణ్‌, ప్రధాన కార్యదర్శిగా షేక్‌ మస్తాన్‌ షరీఫ్‌, సహధ్యక్షులుగా ఎం.మారుతీరావు, జి.రాఘవమ్మ, కోశాధికారిగా డి.శ్రీనివాసరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నరసరావుపేట మున్సిపల్‌ శాఖకు 2023-24 ఏడాదికి గౌరవాధ్యక్షులుగా టి.ఏడుకొండలు అధ్యక్షులుగా ఓ.కోటేశ్వరరావు,సహాధ్యక్షులుగా సిహెచ్‌ .సంపత్‌ కుమార్‌, మహిళా సహాధ్యక్షులుగా బి నిర్మల బాయి,ప్రధాన కార్యదర్శిగా కె.వెంక టేశ్వరరావు, కోశాధికారిగా షేక్‌.అఖీబ్‌ పాషా అదేవిధంగా రొంపిచర్ల మండల శాఖ గౌరవాధ్యక్షులుగా సీతా మహాలక్ష్మి, అధ్యక్షులుగా షేక్‌ మల్లికా బేగం, సహా ధ్యక్షులుగా జి.శిలువ జ్యోతి, మహిళా సహాధ్యక్షురాలిగా నాగ లక్ష్మి, ప్రధాన కార్య దర్శిగా కె.కార్మెల్‌ మేరి, కోశాధికారిగా టి. అనూష, నకరికల్లు మండల శాఖకు గౌర వాధ్యక్షులుగా ఎన్‌. బ్రహ్మయ్య, అధ్యక్షులుగా పి.యోనా, సహాధ్యక్షులుగా జి.శ్రీహరి ప్రసాద్‌,కె.వీరమ్మ, ప్రధాన కార్యదర్శిగా వై. శ్రీనివాసరావు, కోశాధికారిగా పి.బాలాజీ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలు అభినందనలు తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా కె.కార్మెల్‌ మేరి, కోశాధి కారిగా టి. అనూష, నకరికల్లు మండల శాఖకు గౌరవాధ్యక్షులుగాఎన్‌. బ్రహ్మయ్య, అధ్యక్షులుగా పి.యోనా, సహా ధ్యక్షులుగా జి.శ్రీహరి ప్రసాద్‌,కె.వీరమ్మ, ప్రధాన కార్యదర్శిగా వై. శ్రీనివాసరావు, కోశాధికారిగా పి.బాలాజీ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలు అభినందనలు తెలిపారు.

➡️